చక్కెర ఒంట్లో ఎన్ని అవయవాలను దెబ్బ తీస్తుందో తెలుసా..?
24 January 2026
TV9 Telugu
TV9 Telugu
ఆహారంలో భాగంగా చక్కెర తీసుకోవడం దాదాపు అందరికీ అలవాటే. టీ, కాఫీ వంటి వాటితో పాటు తీపి వంటకాల తయారీలో కూడా చక్కెరను ఉపయోగిస్తుంటాం
TV9 Telugu
చక్కెరతో చేసే తీపి వంటకాలు రుచిగా ఉంటాయి. అందుకే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చక్కెరను తీసుకోవడం వల్ల డయాబెటిస్ మాత్రమే వస్తుందని అందరూ భావిస్తూ ఉంటారు
TV9 Telugu
కానీ చక్కెర మన శరీరంలో అన్ని అవయవాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యంపై చక్కెర తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట
TV9 Telugu
ముఖ్యంగా గుండె, కాలేయం, మెదడు, చర్మం ఇలా అన్ని అవయవాలపై చక్కెర చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇలా కాలక్రమేణా మనం చక్కెర దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది
TV9 Telugu
మధుమేహానికి చక్కెర ఒకే ఒక కారణం కాకపోయినప్పటికీ.. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే కళ్లు, మూత్రపిండాలు, నరాలు, గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది
TV9 Telugu
ఊబకాయం వస్తుంది. దీర్ఘకాలం పాటు ఉండే ఊబకాయం క్యాన్సర్ కు కూడా దారి తీస్తుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల 60 నుండి 95 శాతం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి
TV9 Telugu
చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ల ప్రమాదాన్ని పెంచుతుంది
TV9 Telugu
అధిక చక్కెర ఇన్సులిన్, లెప్టిన్ అనే హార్మోన్లకు కూడా అంతరాయాన్ని కలిగిస్తుంది. దీంతో శరీర బరువు పెరుగుతుంది. మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది జ్ఞాపకశక్తి తగ్గేలా చేస్తుంది. అందుకే చక్కెర విషయంలో కాస్త చూసి వ్యవహరించండి