మహా శివరాత్రికి ముస్తాబైన శివాలయాలు…ఆకట్టుకుంటున్న విభిన్న శివలింగ రూపాలు…
తెనాలి సుల్తాన్ బాద్ లోని మిర్చి స్నాక్స్ ఈ ప్రత్యేక శివలింగాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బూందిని ప్రత్యేకంగా పేర్చి దాని చుట్టూ పేపర్ అమర్చారు. శివ లింగం పై అక్కడక్కడ ప్రత్యేక ఆకర్షణగా స్వీట్స్ పెట్టారు. దీంతో మరింతగా ఈ శివలింగం చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ రోజు రాత్రి నుండే కైలాసగిరి కొండపై బూంది శివలింగం ప్రత్యేక ఆకర్షణగా కొలువై ఉంటుందని రేపు భక్తులు పెద్ద ఎత్తున శివలింగాన్ని దర్శించుకోవచ్చని ఆలయ సిబ్బంది తెలిపారు.

గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం పేరేచర్ల సమీపంలోని కైలాసగిరిపై అన్నపూర్త సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం ఉంది. ప్రతి ఏటా కొండపై మహాశివరాత్రి ఉత్సవాలను అంగరంగవైభవంగా చేస్తారు. ఈక్రమంలోనే గుంటూరు చుట్టుపక్కల నుండి పెద్ద ఎత్తున భక్తులు కొండపై ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది కొండపై మరొక ప్రత్యేక ఆకర్షణగా బూంది శివలింగం కొలువుదీర నుంది.
1008 కిలోల బూందితో ప్రత్యేక శివలింగాన్ని ఆలయ నిర్వాహకులు తయారు చేయించారు. ఆరుడగుల ఎత్తుతో ఐదు అడుగుల వెడల్పుతో ఈ శివలింగాన్ని రూపొందించారు. తెనాలి సుల్తాన్ బాద్ లోని మిర్చి స్నాక్స్ ఈ ప్రత్యేక శివలింగాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బూందిని ప్రత్యేకంగా పేర్చి దాని చుట్టూ పేపర్ అమర్చారు. శివ లింగం పై అక్కడక్కడ ప్రత్యేక ఆకర్షణగా స్వీట్స్ పెట్టారు. దీంతో మరింతగా ఈ శివలింగం చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ రోజు రాత్రి నుండే కైలాసగిరి కొండపై బూంది శివలింగం ప్రత్యేక ఆకర్షణగా కొలువై ఉంటుందని రేపు భక్తులు పెద్ద ఎత్తున శివలింగాన్ని దర్శించుకోవచ్చని ఆలయ సిబ్బంది తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..