కామెర్లు వచ్చినప్పుడు తప్పక తీసుకోవాల్సిన ఫుడ్ ఏదో తెలుసా?

Samatha

24 January 2026

కాలేయ సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు, కామెర్లు వస్తుంటాయి. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి, అయితే ఇలాటి సమస్య వచ్చినప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు.

కాలేయ సమస్యలు

ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు కామెర్లతో బాధపడే వారు తమ డైట్‌లో చేర్చుకోవడం వలన సమస్య త్వరగా తగ్గుతుందంట. కాగా, ఆ ఫుడ్ ఏదో ఇప్పుడు చూద్దాం.

పచ్చ కామెర్లు

సిట్రస్ ఫ్రూట్స్ : కామెర్లు ఉన్నవారు తమ డైట్‌లో సిట్రస్ ఫ్రూట్స్ చేర్చుకోవడం చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరంలోని విషాన్ని త్వరగా తొలిగిస్తుందంట.

సిట్రస్ ఫ్రూట్స్

ఆకుకూరలు : ఆకుకూరలు, ముఖ్యంగా బచ్చటి కూర, వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పోషకాలు పుష్కలంగా ఉండటం వలన ఇది కాలేయ సమస్యను తగ్గిస్తుంది.

ఆకుకూరలు

స్వీట్ పొటాటోస్ : చిలకడ దుంపలో విటమిన్, ఫైబర్ వంటివి ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఇవి లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

స్వీట్ పొటాటో

అల్లం : అల్లం యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన లివర్ సమస్యలు తగ్గిపోతాయంట.

అల్లం

గ్రీన్ టీ : కామెర్లు ఉన్నవారు యాంటీ ఆక్సిడెంట్స్, వ్యాధి నిరోధక లక్షణాలు ఉండే గ్రీటీ తాగడం వలన కాలేయ వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

గ్రీన్ టీ

బెర్రీస్ :బెర్రీస్, బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, వంటి వాటిలో పోషకాలు ఎక్కువగా ఉండటం వలన వీటిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరిగి, కాలేయ సమస్యలు తగ్గుతాయి.

బెర్రీస్