ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథతో రామ్ చరణ్ సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు.. ఏ మూవీనో తెలుసా?
ప్రభాస్, రామ్ చరణ్.. ఇప్పుడు వీరిద్దరూ పాన్ ఇండియా హీరోలే. తమ నటనతో గ్లోబల్ స్టార్స్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారీ టాలీవుడ్ స్టార్ హీరోస్. అయితే ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఓ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రామ్ చరణ్. మరి ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం రండి.

పాన్ ఇండియా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తన సినిమా కెరీర్ లో చాలా చిత్రాలను వదిలేశాడు. కథలు బాగోలేవనో, స్టోరీ తనకు సూట్ కాదనో, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమో.. ఇలా పలు కారణాలతో పలు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. నితిన్ దిల్, ఎన్టీఆర్ సింహాద్రి, బృందావనం, అల్లు అర్జున్ ఆర్య, రామ్ చరణ్ నాయక్, మహేష్ బాబు ఒక్కడు, రవితేజ కిక్, డాన్ శీను, గోపీచంద్ జిల్ ఇలా చాలా సినిమా కథలు మొదట ప్రభాస్ దగ్గరకే వచ్చాయట. అయితే బిజీ షెడ్యూల్ ఇతరత్రా కారణాలతో ప్రభాస్ వీటిని వదులుకున్నారట. అలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాదు అప్పటి దాకా వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న మెగా హీరో ప్రభాస్ వద్దనుకున్న మూవీతోనే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. రవి మోహన్ (జయం రవి), నయనతార కాంబినేషన్ లో వచ్చిన తమిళ చిత్రం ‘తనిఒరువన్’. జయం రవి సోదరుడు మోహన్ రాజనే ఈ సినిమాను తెరకెక్కించారు. అరవింద స్వామి స్టైలిష్ విలన్ గా మెప్పించాడు. 2015లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లోనే దాదాపు రూ.150కోట్లు వసూలు చేసిందని అంచనా.
అయితే తని ఒరువున్ సినిమాను మొదట ప్రభాస్ తో చేయాలనుకున్నాడట దర్శకుడు మోహన్ రాజా. అందుకు చాలా ప్రయత్నాలు కూడా చేశారట. అయితే ఆ సమయంలో ప్రభాస్ పూర్తిగ రాజమౌళి బాహుబలి సినిమాలకే కమిటై పోయాడు. దీంతో తనిఒరువన్ మూవీని వదులుకోవాల్సి వచ్చింది.
కాగా ఇదే తని ఒరువన్ సినిమాను తెలుగులో ధ్రువ పేరుతో తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించాడు. తెలుగులోనూ ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా రామ్ చరణ్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఈ సినిమాకు ముందు మెగా పవర్ స్టార్ నటించిన గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఆ సమయంలో ధ్రువ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు రామ్ చరణ్. మొత్తానికి ప్రభాస్ వదులుకున్న మూవీతో చరణ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడని చెప్పొచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




