ఇక ఏడాదికి 2 సార్లు.. 10, 12 తరగతుల పరీక్షలు!
జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించడానికి సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సమాయత్తమైంది. అన్నీ కుదిరితే, వచ్చే ఏడాది అంటే 2026 నుంచే ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనున్నది. దీనికి సంబంధించిన ముసాయిదాపై వచ్చే సోమవారం నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
విద్యార్ధులకు సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించనుంది. అన్నీ కుదిరితే 2026 నుంచే ఈ విధానం కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన ముసాయిదాను ఏర్పాటుచేయగా.. వచ్చే సోమవారం నుంచి దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా 2026-27 విద్యా సంవత్సరం నుంచి గ్లోబల్ కరిక్యులమ్ కూడా అందుబాటులోకి తీసుకురావలని సీబీఎస్సీ బోర్డు యోచిస్తుంది. ఏడాదికి రెండుసార్లు నిర్వహించే బోర్డు పరీక్షల్లో.. విద్యార్థులు ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధిస్తే, వాటినే పరిగణనలోకి తీసుకొంటారు. ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించినా.. విద్యార్థులు రెండుసార్లూ పరీక్షలకు హాజరవ్వడం తప్పనిసరికాదు. జేఈఈ మాదిరిగా 10, 12 తరగతుల విద్యార్థులు కూడా బోర్డు పరీక్షలకు రెండుసార్లు హాజరవ్వొచ్చు. ఇది పూర్తిగా విద్యార్ధుల ఛాయిస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమెను అంతరిక్షంలో వదిలివేయాలనుకున్నారు ??
గోరు వెచ్చని నీళ్లను తాగితే ఎన్నో లాభాలు
ఇంత వెధవల్లా ఉన్నారేంట్రా! కుంభమేళాలో మహిళల స్నానం
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

