మెక్సికో తీరంలో డూమ్స్ డే ఫిష్ కలకలం.. రాబోయే ప్రళయానికి సంకేతమా
పట్టుకుంటే చేతిలోంచి సర్రున జారిపోయే అరుదైన చేప మెక్సికో లోని పసిఫిక్ తీరంలో కనిపించింది. ఈ చేప పాములా పొడవుగా ఉంటుంది. దేహం ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఈ చేపను ‘డూమ్స్ డే ఫిష్’ అని కూడా అంటారు. డూమ్స్ డే అంటే ‘ప్రళయ దినం’ అని అర్థమట. ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించబోయే ముందు ఈ చేప తీరప్రాంతంలో కనిపిస్తుందనే నమ్మకం ఉంది.
జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపను ‘మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్’ అంటారట. అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతం ఇస్తుందట. 2011లో జపాన్‌లో సముద్రం లోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడటానికి ముందు కూడా ఇలాంటి చేపలు సుమారు 20 తీర ప్రాంతంలో కనిపించాయట. ఇప్పుడు మెక్సికో తీరంలో ఈ చేప కనిపించడంతో ఏదో జరగబోతుందనే ఆందోళన అక్కడి స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సముద్రం అడుగులో ఉండే చేపలు జబ్బు పడినప్పుడు, మరణించినప్పుడు తీరానికి కొట్టుకొస్తాయని, అది సాధారణ విషయమేనని కొంతమంది లైట్ తీసుకుంటున్నారు. మరో యూజర్ లైట్ తీసుకున్నాడు. అరుదైన డూమ్స్ డే ఫిష్ 36 అడుగుల పొడవు వరకు పెరుగుతుందట. ఇవి సముద్ర ఉపరితలానికి కిలోమీటర్ లోతు వరకు వెళ్తాయని ఫ్లోరిడాలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం సిబ్బంది తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక ఏడాదికి 2 సార్లు.. 10, 12 తరగతుల పరీక్షలు!
ఆమెను అంతరిక్షంలో వదిలివేయాలనుకున్నారు ??
గోరు వెచ్చని నీళ్లను తాగితే ఎన్నో లాభాలు

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
