AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tadipatri: సినీ నటి మాధవీలతపై కేసు నమోదు చేసిన తాడిపత్రి పోలీసులు

తాడిపత్రిలో జేసీ వర్సెస్‌ మాధవిలత అన్నట్లు ఉంది సిచ్యూవేషన్‌. ఈ వార్‌కు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేటట్లు కనిపించడం లేదు. ఇప్పుడీ వివాదం తాడిపత్రి పోలీసుల పంచకు చేరింది. మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ కేసులో నెక్ట్స్‌ ఏంటి..? ఈ కేసుపై మాదవీలత ఏమంటుంది.. తెలుసుకుందాం పదండి....

Tadipatri: సినీ నటి మాధవీలతపై కేసు నమోదు చేసిన తాడిపత్రి పోలీసులు
Actress Madhavi Latha
Ram Naramaneni
|

Updated on: Feb 25, 2025 | 4:53 PM

Share

జేసీ – మాధవీలత మధ్య వివాదం మరింత ముదురుతోంది. గతంలో మాధవీలత కామెంట్స్‌తో మొదలైన ఈ రచ్చ.. జేసీ రియాక్షన్‌తో వేడెక్కింది. ఇక అప్పటి నుంచి ఈ వివాదం పోలీస్ స్టేషన్ల చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలత తాడిపత్రి మహిళలను కించపరిచేలా మాట్లాడారని మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కమలమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ దగ్గరికి రీల్‌ రివైండ్‌ చేయాలి. తాడిపత్రిలో డిసెంబర్‌ థర్టీఫస్ట్‌ జేసీ నిర్వహించిన ఈవెంట్‌కి మహిళలు వెళ్లొద్దంటూ మాధవీలత, యామిని పిలుపివ్వడంపై JC భగ్గుమన్నారు. మాధవీలతపై బూతులతో విరుచుకుపడ్డారు. జేపీ కామెంట్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడంతో ఆయన క్షమాపణలు కోరారు. అయితే అంతటితో ఆ వివాదం ముగుస్తుందని అంతా భావించారు. కానీ జెసి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై మాధవిలత సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక ఆ రోజు నుంచీ జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు పీక్స్‌కి చేరింది. తాజాగా తాడిపత్రిలో మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. తాడిపత్రి మహిళలను కించపరిచేలా మాట్లాడారని మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కమలమ్మ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో BNS సెక్షన్ 353 ఆఫ్‌ 1-B కింద కేసు నమోదు చేశారు. దీంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చింది.

మొత్తంగా ఇన్ని పరిణామాల మధ్య జేసీ వర్సెస్‌ మధవిలత ఎపిసోడ్‌ రక్తి కడుతోంది. ఇప్పటికే ఈ ఇష్యూలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఈ లొల్లి ఎక్కడివరకూ వెళ్లి ఆగుతుందో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి