AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wall Clock: ఆగిన గడియారం ఇంట్లో పెట్టుకుంటే ఇంత డేంజరా.. ఎవరూ చెప్పని సీక్రెట్స్ ఇవి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో విరిగిపోయిన గడియారాలు అశుభానికి చిహ్నాలుగా పరిగణించబడతాయి. ఏదైనా కీడు జరిగే ముందు ఈ గడియారాలు మనకు ముందే సంకేతాలిస్తాయని కొందరు నమ్ముతుంటారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఇలా పాడైపోయిన వాటిని వెంటనే రిపేర్ చేయించడమో.. లేక కొత్తవి కొనడమో చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Wall Clock: ఆగిన గడియారం ఇంట్లో పెట్టుకుంటే ఇంత డేంజరా.. ఎవరూ చెప్పని సీక్రెట్స్ ఇవి
Wall Clock Vasthu Tips
Bhavani
|

Updated on: Feb 25, 2025 | 6:29 PM

Share

అవసరం ఉన్నా లేకున్నా ఇంట్లో రకరకాల గడియారాలను వాడుతుంటారు కొందరు. కొత్తవాటిని తెచ్చినప్పుడు పాతవి, పాడైపోయినవి, విరిగినవాటిని అలాగే వదిలేస్తుంటారు. చేతి గడియారాల విషయంలోనూ కొందరు ఇంతే నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఆఫీసుకు వెళ్లే తొందర్లో వాచ్ పనిచేయకున్నా పెట్టుకుని వెళ్లిపోతుంటారు. దాని అద్ధంపై కొన్ని సార్లు పగుళ్లు వస్తుంటాయి. వాటిని కూడా అలాగే వాడేస్తుంటారు. ఇవి మామూలు విషయాలే అనిపిస్తున్నా వీటి వల్ల కలిగే అనర్థాలు చాలానే ఉన్నాయి. మీరు ఈరోజు జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఈ పగిలిన, పాడైపోయిన వాచ్ లే కారణం అంటే మీరు నమ్ముతారా? .. అంతలా ఇవి మనుషుల జీవితాలపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇలా పనిచయని గడియారాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో మీరూ తెలుసుకోండి..

కుటుంబంలో కలహాలా..?

మీ కుంటుంబం మీ ప్రమేయం లేకుండానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?.. అందుకు కూడా ఈ గడియారాలే కారణం అయ్యుండవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉండటానికి పాడైపోయిన వాచ్ లు ప్రధాన కారణంగా చెప్తారు. వీటి వల్ల కుటుంబంలో చికాకులు ఎక్కువవుతుంటాయి. ఓసారి మీ ఇంట్లో ఏ మూలన ఇలాంటి వస్తువులు ఉన్నా వెతికి వాటిని బయట పారేయండి. మీ ఫ్యామిలీలో వచ్చే సానుకూల మార్పులు మీరే గమనిస్తారు.

చేతి గడియారం టైమ్ మార్చగలదు..

జీవితం ఎటు పోతుందో అర్థం కావడంలేదు. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండటం లేదు.. రోజూ ఏదో ఒక సమస్య అని ఎవరైనా ఫీలవుతుంటే కచ్చితంగా మీ టైమ్ చెక్ చేసుకోవాల్సిన టైమిది. ఎందుకంటే మీ చేతి గడియారాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో చూడండి. అందులో ఏదైనా లోపాలుంటే వెంటనే సరిచేయండి. మొత్తానికి ఎలాంటి రిపేర్లు లేని వాటినే వాడండి. ఇవి మీ కెరీర్ ను తిరిగి గాఢిలో పెట్టగలవు.

బాస్‌తో పడట్లేదా..

ఆఫీస్ లో తరచూ కొలీగ్స్, బాస్ తో ఏదో ఒక చికాకు అనిపిస్తున్నా కూడా మీరు ఈ రెమిడీని ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా డిజిటల్ వాచ్ లు ధరించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మంచైనా, చెడైనా ఇవి మరింత వేగంగా ప్రభావం చూపగలవు.

ఎదుగుదల లేకుండా చేస్తుంది..

శారీరకంగా, ఆధ్యాత్మికంగా మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నట్టుగా మీకు అనిపిస్తుంటే మీరు సరిగా పనిచేస్తున్న వాచ్ నే పెట్టుకుంటున్నారో లేదో గమనించండి. లేదో మీ ఇంట్లో మీరు వాడేసిన వాచ్ లు ఇంకా అలాగే ఉంటే అందులో పాడైపోయిన వాటిని తొలగించండి.

ఒత్తిడికి టైమే కారణమా..?

మీరు తరచుగా ఒత్తిడి లేదా నిరాశకు గురవుతుంటే అది మీ ఆగిన గడియారం మూలంగానే అయ్యుండవచ్చు. ఇది మీ వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను ఇరుకున పెట్టొచ్చు.