రేకుల షెడ్డులో ఏటీఎం మిషన్.. TV9 ఏంట్రీతో సీజ్.. అసలేం జరిగిందంటే..!
కూరగాయల షాప్ ఏర్పాటు కోసం విద్యుత్ శాఖ అధికారుల వద్ద కనెక్షన్ తీసుకున్నారు. అయితే కూరగాయాలకు బదులుగా ATM సెంటర్ ఏర్పాటు చేయడం విచిత్రంగా ఉందని అన్నారు స్థానికులు. ఇంత జరుగుతున్న పంచాయతీ అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామ పంచాయతీ చేపల సంత మార్కెట్ వద్ద రేకుల షెడ్ లో INDIA1 ATM ఏర్పాటు చేశారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్‌లో ATM ఏర్పాటు చేయడం పట్ల అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. కాయగూరలు షాప్ పెట్టుకోవడానికి పంచాయతీ వద్ద లీజుకు తీసుకున్నాడు ఓ వ్యక్తి. షాప్ ఏర్పాటు చేయకుండా ఏకంగా ATM సెంటర్‌కు సబ్ లీజుకు ఇచ్చాడు. ఈ విషయం తెలిసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయల షాప్ ఏర్పాటు కోసం విద్యుత్ శాఖ అధికారుల వద్ద కనెక్షన్ తీసుకున్నారు. అయితే కూరగాయాలకు బదులుగా ATM సెంటర్ ఏర్పాటు చేయడం విచిత్రంగా ఉందని అన్నారు స్థానికులు. ఇంత జరుగుతున్న పంచాయతీ అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 216 జాతీయ రహదారి ప్రక్కనే ఎటువంటి అనుమతులు లేకుండా, కనీసం భద్రతా ప్రమాణాలు పాటించకుండా రేకుల షెడ్‌లో ATM ఏర్పాటు చేయడంపై ఖాతాదారులు మండిపడ్డారు. భద్రత సౌకర్యం లేని ప్రాంతంలో ATMకు ఎలా అనుమతి ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
టీవీ9 కెమెరా క్లిక్ ఇంపాక్ట్..
మురమళ్ల సంత మార్కెట్ రేకుల షెడ్‌లో ATM ఏర్పాటు చేయడంపై టీవీ9 కెమెరా క్లిక్ కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మురమళ్ల సంత మార్కెట్ రేకుల షెడ్ లో INDIA1 ATM టీవీ9 ఇస్మార్ట్ న్యూస్ కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. INDIA1 ATM రేకుల షెడ్ షాప్‌ను మురమళ్ల పంచాయతీ కార్యదర్శి రవిరాజ్, సిబ్బంది సీజ్ చేశారు. టీవీ9 కథనానికి స్పందించి ATM ను సీజ్ చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు షాప్ పెట్టకుండా INDIA1 ATM కు సబ్ లీజు కు ఒక వ్యక్తి ఇవ్వడంపై పంచాయతీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ లీజు దారుడిని అధికారులు ఫోన్ లో సంప్రదించడానికి ప్రయత్నం చేసి, నోటీసులు జారీ చేశారు. ఫలితం లేకపోవడంతో రేకుల షెడ్ షాప్ సీజ్ చేసి, రేకుల షెడ్ లో ATM తీసివేయాలని బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు పంచాయతీ కార్యదర్శి.
వీడియో చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..