Rangabali Movie: రంగబలి నుంచి ‘కల కంటూ ఉంటే’ సాంగ్ ప్రోమో రిలీజ్..
డైరెక్టర్ పవన్ బసంసెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తుంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి కల కంటూ ఉంటే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో నాగశౌర్య ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రంగబలి. డైరెక్టర్ పవన్ బసంసెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తుంది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి కల కంటూ ఉంటే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన కల కంటూ ఉంటే సాంగ్ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 7న ప్రపంచవ్యా్ప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ పూర్తి పాటను జూన్ 19న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.
ఈ సినిమాలో సత్య, అనంత్ శ్రీరామ్, గోపరాజు రమణ, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా నాగశౌర్య.. నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.