Jr NTR and Prashanth Neel: ఇద్దరి పెళ్లి రోజులు సేమ్ డేట్.. భార్యలతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న తారక్, ప్రశాంత్ నీల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి కాస్త రిలాక్స్ అవుతున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ తో ఓ సినిమా అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి కాస్త రిలాక్స్ అవుతున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ తో ఓ సినిమా అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel)తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో మరికొద్దిరోజుల్లో తారక్ బిజీ కానున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా అనుకున్న రిజల్ట్ ఇవ్వకపోవంతో తారక్ తన కథ పై మరోసారి వర్క్ చేయమని కొరటాలకు సూచించాడట.. సినిమా ఆలస్యం అయినా పర్లేదు అని చెప్పడంతో తారక్ కు మరింత ఫ్రీ టైం దొరికింది. గ్యాప్ దొరికితే ఫ్యామిలీ తో స్పెండ్ చేసే తారక్ తాజాగా తన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. ఇక్కడ మరో హైలైట్ టాపిక్ ఏంటంటే తారక్ ,ప్రణతిలతో పాటు మరో జంట కూడా వీరితో కలిసి తమ వెడ్డింగ్ యానివర్సరీను సెలబ్రెట్ చేసుకున్నారు. ఇంతకు ఆ జంట ఎవరనుకుంటున్నారా.. దర్శకుడు ప్రశాంత్ నీల్,లిఖిత
ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, ప్రశాత్ నీల్, ఆయన భార్య లిఖితలు కలిసి తమ వెడ్డింగ్ యానివర్సరీ వేడుక జరుపుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన ఫొటోలను జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేశారు. ‘సరికొత్త ప్రారంభం’ అంటూ ఎన్టీఆర్ క్యాప్షన్ పెట్టారు. ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాఫ్టర్ 2ని ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా సెట్స్ పైన ఉంది. ఈ సినిమా తర్వాత తారక్ తో సినిమా చేయనున్నాడు ప్రశాంత్. అటు కొరటాల సినిమా అయిపోయిన వెంటనే ప్రశాంత్ సినిమా మొదలుపెట్టనున్నాడు తారక్. ఈ కాంబోలో రాబోతున్న సినిమా పై తారక్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :