Sarkaru Vaari Paata: మా.. మా.. మహేశా… మాస్ సాంగ్‌తో రెడీ అవుతున్న సర్కారు వారి పాట.. ఫ్యాన్స్ గెట్ రెడీ
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటటైనర్ సర్కారు వారి పాట. హిట్ దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటటైనర్ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). హిట్ దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ , ట్రైలర్ సినిమా పై అంచలనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే చాట్ బస్టర్ గా నిలిచాయి. కళావతి సాంగ్ 150 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి యూట్యూబ్ లో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. పెన్నీ సాంగ్, టైటిల్ ట్రాక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మే 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఇక ఈ క్రమంలో మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలోని మాస్ మసాలా సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. మే 7న ఈపాటను వదలనున్నారు. ఈ మేరకు అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ , కీర్తి ఇద్దరు కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు.. మా మా మహేశా అంటూ సాగే ఈ మాస్ బీట్ ను రేపు (7న ) రిలీజ్ చేయనున్నారు. మరో వైపు రేపు సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగనుంది.
#SVPMania will Peak ❤️?
Super? @urstrulyMahesh & @KeerthyOfficial are ready with their Mass Moves??
MASSiest Song of the Season #MaMaMahesha on 7th May ?#SarkaruVaariPaata #SVP@ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/Vvd6VdtgiQ
— Mythri Movie Makers (@MythriOfficial) May 6, 2022