Jersey Movie: ఫ్యాన్స్‏ను మళ్లీ ఎమోషనల్ చేసిన నాని.. వైరలవుతున్న జెర్సీ డెలీటిడ్ సీన్..

ఈ కల్ట్ క్లాసిక్ చాలా మందికి హాట్ ఫేవరెట్ మూవీ. ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తైన ఇప్పటికీ టీవీల్లో వస్తే ఛానల్ మార్చకుండా చూసే అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలో అర్జున్ పాత్రలో నాని నటన అడియన్స్ కళ్ల ముందు మెదులుతుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి తొలగించిన సన్నివేశం ఇప్పుడు యూట్యూబ్ లో వైరలవుతుంది.

Jersey Movie: ఫ్యాన్స్‏ను మళ్లీ ఎమోషనల్ చేసిన నాని.. వైరలవుతున్న జెర్సీ డెలీటిడ్ సీన్..
Jersey Movie
Follow us

|

Updated on: Jun 15, 2024 | 8:17 PM

న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో జెర్సీ ఒకటి. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచింది. ఈ మూవీలో నాని ఎప్పటిలాగే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ కల్ట్ క్లాసిక్ చాలా మందికి హాట్ ఫేవరెట్ మూవీ. ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తైన ఇప్పటికీ టీవీల్లో వస్తే ఛానల్ మార్చకుండా చూసే అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలో అర్జున్ పాత్రలో నాని నటన అడియన్స్ కళ్ల ముందు మెదులుతుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి తొలగించిన సన్నివేశం ఇప్పుడు యూట్యూబ్ లో వైరలవుతుంది.

నిజానికి ఈ సన్నివేశాన్ని చిత్రయూనిట్ గతంలోనే రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరోసారి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో నాని మామయ్య ఆయనకు రూ.50,000 ఇచ్చి ఉద్యోగం చేయమని చెప్తాడు. ఆ డబ్బులు తన కోసం కాదని.. తన కూతురు, మనవడు భవిష్యత్తు కోసమని చెబుతాడు. అందుకు నాని ఒప్పుకోడు. అలాగే ఆ డబ్బులు కూడా తనకు వద్దంటాడు. దీంతో నాని తీరుపై అతడు మండిపడతాడు.

క్రికెట్ తప్ప మరే పని చేయలేవంటూ.. అసలు ఏమి రాదంటూ నానిని అవమానిస్తూ మాట్లాడతాడు. దీంతో నాని చెప్పే మాటలు మనసుక హత్తుకుంటాయి. నువ్వేం చేయలేవని, లూజర్ వి అంటూ తమ మామయ్య అవమానించినా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.తీవ్రమైన భావోద్వేగాలతో నిండిన ఈ సన్నివేశం మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇందులో నాని చెప్పే డైలాగ్స్ వింటే కళ్లు చెమర్చకమానవు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించగా.. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రోనిత్ కమ్రా, సత్యరాజ్, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..