AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposit: ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే టాప్‌ బ్యాంకులు!

Fixed Deposit Interest Rates: బడ్జెట్ 2026లోనూ సీనియర్ సిటిజన్లకు ఎలాంటి ప్రధాన ప్రకటనలు, మార్పులు లేవు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రభావం చూపించే నిర్ణయాలేమీ ప్రకటించలేదు. ఈ క్రమంలో అధిక వడ్డీ రేట్లు కల్పించే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఆర్బీఐ..

Fixed Deposit: ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే టాప్‌ బ్యాంకులు!
Fixed Deposit
Subhash Goud
|

Updated on: Feb 09, 2026 | 11:33 AM

Share

Fixed Deposit Interest Rates: ఈ సంవత్సరం తన మొదటి పాలసీ సమీక్ష సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (MPC) రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించింది. ప్రస్తుత పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేంద్ర బ్యాంకు పాలసీ రేటును మార్చకుండా ఉంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6, శుక్రవారం నాడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆరవ, చివరి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించిన RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా, తటస్థ వైఖరితో స్వల్పకాలిక రుణ రేటు లేదా రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని RBI నిర్ణయించిందని అన్నారు.

2025లో RBI రెపో రేటును నాలుగుసార్లు తగ్గించింది. ఫలితంగా మొత్తం 125 బేసిస్ పాయింట్లు (1.25%) తగ్గింది. ఫిబ్రవరి సమావేశానికి ముందు డిసెంబర్‌లో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులకు రుణాలు తీసుకోవడం చౌకగా మారుతుందిజ బ్యాంకులకు రుణాలు తీసుకోవడం చౌకగా మారుతుంది. ఇది వినియోగదారులకు రుణ ఖర్చులను తగ్గిస్తుంది. అయితే, రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు తమ FD రేట్లను కూడా తగ్గిస్తాయి.

అలాగే బడ్జెట్ 2026లోనూ సీనియర్ సిటిజన్లకు ఎలాంటి ప్రధాన ప్రకటనలు, మార్పులు లేవు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రభావం చూపించే నిర్ణయాలేమీ ప్రకటించలేదు. ఈ క్రమంలో అధిక వడ్డీ రేట్లు కల్పించే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఆర్బీఐ రెపో రేటును మార్చకుండా ఉంచిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల ఎఫ్‌డీ కోసం ప్లాన్ చేయడానికి ఇదే సరైన సమయం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:

RBI MPC సమావేశం నిర్ణయం తర్వాత డిసెంబర్ 12, 2025న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన FD రేట్లను సవరించింది. ప్రస్తుతం బ్యాంక్ సాధారణ పౌరులకు 3.05% నుండి 6.45% వరకు, సీనియర్ సిటిజన్లకు 3.55% నుండి 7.05% వరకు రేట్లను అందిస్తోంది.

HDFC బ్యాంక్ మూడేళ్ల కాలపరిమితి గల MCLRను 5 బేసిస్ పాయింట్లు (0.05%) తగ్గించింది. అయితే మిగతా అన్ని కాలపరిమితి గల రుణాలపై MCLR రేట్లను బ్యాంక్ యథాతథంగా ఉంచింది. అంటే మూడేళ్ల MCLRతో అనుసంధానించిన రుణాలు ఉన్న రుణ వినియోగదారులు మాత్రమే ఈ ప్రయోజనం పొందుతారు. అలాగే యెస్‌ బ్యాంక్ సాధారణ ప్రజలకు 3.25% నుండి 7% వరకు FD రేట్లను, సీనియర్ సిటిజన్లకు 3.75% నుండి 7.75% వరకు రేట్లను అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..