Vijay Deverakonda: రవిబాబు డైరెక్షన్‏లో విజయ్ దేవరకొండ హారర్ థ్రిల్లర్.. ఎలా మిస్సయ్యిందంటే..

ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. అయితే ఇన్నాళ్లు ప్రేమకథ చిత్రాలతో మెప్పించిన రౌడీ హీరో.. ఓ హార్రర్ సినిమాను మిస్సయ్యారట. డైరెక్టర్ కమ్ నటుడు రవిబాబు తెరకెక్కించిన అవును సినిమాలో విజయ్ దేవరకొండ నటించాల్సిందట. కానీ కొన్ని కారణాలతో మిస్సయ్యిందట. మరీ ఆ విశేషాలేంటో తెలుసుకుందామా.

Vijay Deverakonda: రవిబాబు డైరెక్షన్‏లో విజయ్ దేవరకొండ హారర్ థ్రిల్లర్.. ఎలా మిస్సయ్యిందంటే..
Ravibabu, Vijay Deverakonda
Follow us

|

Updated on: Jun 15, 2024 | 8:46 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్.. ఆ తర్వాత ఎన్నో రొమాంటిక్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో అలరించారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా వంటి హిట్ చిత్రాలతో అలరించిన విజయ్.. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. అయితే ఇన్నాళ్లు ప్రేమకథ చిత్రాలతో మెప్పించిన రౌడీ హీరో.. ఓ హార్రర్ సినిమాను మిస్సయ్యారట. డైరెక్టర్ కమ్ నటుడు రవిబాబు తెరకెక్కించిన అవును సినిమాలో విజయ్ దేవరకొండ నటించాల్సిందట. కానీ కొన్ని కారణాలతో మిస్సయ్యిందట. మరీ ఆ విశేషాలేంటో తెలుసుకుందామా.

వైవిధ్యభరిత కాన్సెప్ట్ తెరకెక్కించడంలో రవిబాబు స్టైలే వేరు. ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో హారర్ థ్రిల్లర్ మూవీ అవును ఒకటి. ఇందులో కథానాయకుడి పాత్రకు ముందుగా విజయ్ దేవరకొండను అనుకున్నారట. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిబాబు ఈ విషయాలను బయటపెట్టాడు. మీ విషయంలో విజయ్ హర్ట్ అయ్యారట.. నిజమేనా ? అని యాంకర్ అడగ్గా.. రవిబాబు మాట్లాడుతూ.. “విజయ్ హర్ట్ అయ్యాడనే విషయమే నాకు తెలియదు. నాతో ఎప్పుడూ చెప్పలేదు. నా దర్శకత్వంలో విజయ్ నువ్విలా సినిమాలో నటించాడు. నాకు తెలిసిన ఓ వ్యక్తి అతడిని పరిచయం చేశాడు. నేననుకున్న ఓ పాత్రకు అతడు బాగుంటాడని అనిపించి ఎంపిక చేశాను.

తర్వాత మేము కలిసి మూడు యాడ్స్ చేశాం. అవును సినిమాలో హీరో పాత్రకు విజయ్ అనుకున్నాను. కానీ ఆ సమయానికి విజయ్ అందుబాటులో లేకపోవడంతో హర్షవర్దన్ రాణేను తీసుకున్నాం. ఇప్పటికీ విజయ్ తో టచ్ లోనే ఉన్నాను. ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ తో కలిసి నటించాను” అంటూ చెప్పుకొచ్చారు. అవును సినిమాలో పూర్ణ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా అవును 2 వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..