AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్కీ గర్ల్..! సీనియర్లు, యంగ్ హీరోలు అందరితోనూ హిట్సే..!! 7 సినిమాల్ చేస్తే ఒకేఒక్క ఫ్లాప్

ప్రస్తుతం దక్షిణాదిలోని క్రేజీ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అనుకున్నంత క్రేజ్ వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆపర్స్ మాత్రం రాలేదు. గోల్డెన్ బ్యూటీగా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది..

లక్కీ గర్ల్..! సీనియర్లు, యంగ్ హీరోలు అందరితోనూ హిట్సే..!! 7 సినిమాల్ చేస్తే ఒకేఒక్క ఫ్లాప్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2026 | 11:39 AM

Share

కొంతమంది హీరోయిన్స్ లక్కు భలే ఉంటుంది.. హిట్ లేకపోయినా ఆఫర్స్ క్యూ కడతాయి.. లేదా వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంటారు. ఇంకొంతమంది ఫ్లాపుల్లో ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో, పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో లక్కీ గర్ల్స్ చాలా మంది ఉన్నారు.. వారిలో ముందువరసలో ఉండే ముద్దుగుమ్మ ఈ అమ్మడు. ఈ అమ్మడిది మాములు లక్కు కాదు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఒకేఒక్క ఫ్లాప్ వచ్చినా అని పెద్దగా ఈ మాది కెరీర్ మీద ప్రభావం చూపించలేదు. నటనతోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. చేసింది 7 సినిమాలే కానీ ఒకే ఒక్క ఫ్లాప్ అందుకుంది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ హీరోయిన్.. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించి హిట్స్ అందుకుంది ఆమె ఎవరో కాదు అందాల భామ సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. ఈ అందాల భామ. కెరీర్ బిగినింగ్ లో మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసింది ఈ చిన్నది. ఆతర్వాత తెలుగులో బిజీగా మారింది. ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాల్లో డెవిల్ సినిమా ఒక్కటే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మిగిలిన సినిమాల్ని హిట్ అయ్యాయి. ఇటీవలే అఖండ 2, నారీ నారీ నడుమ మురారి సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు పూరిజగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.