తూర్పు గోదావరిలో పట్టుబడిన పులి విశాఖపట్నంలోని ఎండాడ యానిమల్ రెస్క్యూ సెంటర్లో సంరక్షణ పొందుతోంది. ఒత్తిడి కారణంగా ఘన ఆహారం తీసుకోకపోయినా, నీరసం రాకుండా గ్లూకోస్, ఎలక్ట్రోలైట్స్ అందిస్తున్నారు. మనుషుల అలికిడికి తీవ్రంగా స్పందించడంతో, సిబ్బంది రాకపోకలను నియంత్రించి, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.