శ్రీకాకుళం జిల్లా అనకాపల్లి గ్రామ శివారులోని జీడి తోటల్లో ఓ పిల్ల ఎలుగుబంటి ఐరన్ ఫెన్సింగ్‌లో చిక్కుకుంది. తన బిడ్డను రక్షించుకునేందుకు తల్లి ఎలుగుబంటి అక్కడే ఉండి అరుస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు, రెస్క్యూ టీం రంగంలోకి దిగి తల్లిని అడవిలోకి మళ్లించి, పిల్ల ఎలుగుబంటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.