AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైలాగ్ చెప్పలేకపోతే ఆ హీరో నన్ను కొట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి శ్రీలక్ష్మీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ లేడీ కమెడియన్లలో శ్రీలక్ష్మి ఒకరు. ఎంతో మందికి ఆమె రోల్ మోడల్. ఒకప్పుడు తనదైన నటనతో ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యేలా నవ్వించావాళ్లు. వెండితెరపై ఆమె కనిపించగానే అడియన్స్ పెదవులపైకి చిరునవ్వు వచ్చేది. హాస్యనటిగానే కాకుండా.. కథానాయికగానూ అలరించింది .

డైలాగ్ చెప్పలేకపోతే ఆ హీరో నన్ను కొట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి శ్రీలక్ష్మీ
Srilakshmi
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2026 | 10:21 AM

Share

తెలుగు తెర పై నవ్వులు పూయించే కమెడియన్స్ చాలా మంది ఉన్నారు.  మేల్ కమెడియన్స్ మాత్రమే కాదు ఫీమేల్ కమెడియన్స్ కూడా చాలా మంది టాలీవుడ్ లో నవ్వులు పూయించారు. వారిలో సీనియర్ నటి శ్రీలక్ష్మీ ఒకరు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వులు పూయించారు శ్రీలక్ష్మీ. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు శ్రీలక్ష్మి. ప్రస్తుతము మీ సినిమాల స్పీడ్ తగ్గించారు. శ్రీలక్ష్మీ మేనకోడలు ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఓ హీరో గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తాజాగా శ్రీలక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటుడు రాజేంద్ర ప్రసాద్‌తో జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. రేలంగి నరసింహారావు గారి దర్శకత్వంలో వచ్చిన ఒక చిత్రంలో డైలాగు తనకు చివరిలో ఇవ్వడంలో అందరూ చెప్పగా తన వంతు రాగానే మర్చిపోయేదాన్ని..మర్చిపోయి వెంటనే వదిలేసేదాన్ని. ఇది చూసిన రాజేంద్ర ప్రసాద్ “అబ్బా! మేమంతా ఇంత కష్టపడి చెప్పిన తర్వాత నువ్వు వదిలేస్తావా…?” ఇప్పుడు అందరం మళ్లీ చెప్పాలి అని సరదాగా అనేవారని ఆమె అన్నారు. ఈ సంఘటన తర్వాత, ఆమె అలర్ట్‌గా ఉండేదాన్ని అని.. డైలాగ్ గుర్తుపెట్టుకొని టక్కున చెప్పేదాన్ని.. నేను డైలాగ్ చెప్పగానే “శ్రీలక్ష్మి చెప్పేసింది, ఇంక వన్ మోర్ లేదు, పదండి” అని రాజేంద్ర ప్రసాద్ సరదాగా చెప్పేవారని అన్నారు. అప్పటి నుండి, ఆమె డైలాగులు చెప్పేటప్పుడు అందరూ అప్రమత్తంగా ఉండేవారని తెలిపారు శ్రీలక్ష్మీ.

అలాగే, నూతన్ ప్రసాద్‌తో శ్రీవారికి ప్రేమలేఖ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆమె వివరించారు. ఒక లాంగ్ షాట్‌లో బంతి చామంతి పాటను లిప్ మూవ్‌మెంట్ ఇస్తూ, నూతన్ ప్రసాద్‌ను పాడమని కోరారు. అయితే, ఆయన “నువ్వు పాడితే నేను లిప్ మూవ్‌మెంట్ ఇస్తానా? ఇది లాంగ్ షాట్, కెమెరా జూమ్ చేస్తారు. నీకు తెలియదా?” అని మందలించారని తెలిపారు. ఈ విషయం నూతన్ ప్రసాద్ తర్వాత జంధ్యాల గారికి ఫిర్యాదు చేశారని, అప్పుడు గానీ జూమ్ గురించి తనకు తెలియదని శ్రీలక్ష్మి అన్నారు. అదే విధంగా చంద్రమోహన్ గురించి చెబుతూ, ఒక డైలాగ్ చెప్పలేక ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆయన సరదాగా చెవి మీద కొట్టారని గుర్తు చేసుకున్నారు. జంధ్యాల గారి దర్శకత్వంలో తప్పు చేస్తే ఆయన తిట్టేవారని, అందుకే డైలాగులు నోట్లో పెట్టుకొని సిద్ధంగా ఉండేదాన్ని అని తెలిపారు. ఇలాంటి సంఘటనలన్నీ తన కెరీర్‌ను తీర్చిదిద్దాయని ఆమె అభిప్రాయపడ్డారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.