AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు పాటు వైన్స్, బార్లు బంద్!

తెలంగాణలోని మందు బాబులకు ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే నేటి సాయంత్రం నుంచి రెండురోజుల పాటు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అవును తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి 11 సాయంత్రం వరకు వైన్‌షాపులు, బార్లు మూతబడనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Liquor shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు పాటు వైన్స్, బార్లు బంద్!
Alcohol Ban Telangana February 2026
Anand T
|

Updated on: Feb 09, 2026 | 9:57 AM

Share

తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5గంటల నుంచి పోలింగ్ తేదీ అనగా ఫిబ్రవరి 11 సాయంత్రం 5గంటల వరకు రాష్ట్రంలోని ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఉన్న వైన్‌షాపులు, బార్లు మూతపడనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల ఫలితాల రోజు అనగా ఫిబ్రవరి 13న కూడా మద్యం షాపులు, బార్లు మూతబడనున్నట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

ఇక రాష్ట్రంలో సోమవారం సాయంత్రంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఈ ఆంక్షలను అమల్లోకి తీసుకురానున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయించినా, షాపులు ఓపెన్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా దుకాణాలు లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ఆంక్షలు కేవలం ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.