Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్, పుష్ప 1 అలాగే పుష్ప 2 రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం దాదాపు 4–5 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్ అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ అధ్యక్షత వహించారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి సంబంధించి సన్నాహక ప్రణాళికలను ఈ సందర్భంగా ప్రారంభించారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో, ఎంపికైన ప్రతినిధులకు వారి పాత్రలు, బాధ్యతలను స్పష్టంగా వివరించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై విస్తృతంగా చర్చ జరిగింది. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు.
అలాగే, ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సమావేశంలో వెల్లడించారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగాలని నేతలు పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
