AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఛీ.. ఛీ.. ఈ నవ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నార్రా.. టెన్త్ ఫేర్‌వెల్ పార్టీలో అశ్లీల నృత్యాలు..

పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు పలు పాఠశాలల్లో ఫేర్‌వెల్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఏ విధంగా మంచి మార్కులు సాధించాలి.. అనే విషయాలపై ఉపాధ్యాయులు సూచనలు చేస్తున్నారు. అయితే.. అలాంటి ఫేర్‌వేల్ పార్టీలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడం కలకలం రేపింది..

Andhra: ఛీ.. ఛీ.. ఈ నవ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నార్రా.. టెన్త్ ఫేర్‌వెల్ పార్టీలో అశ్లీల నృత్యాలు..
Dance
Shaik Madar Saheb
|

Updated on: Feb 09, 2026 | 11:59 AM

Share

మరికొన్ని రోజులు ఆగితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. దీంతో ఉపాధ్యాయులు అలర్ట్ అయ్యారు. విద్యార్థులు పాస్ అయ్యేలా.. సన్నాహాలు ప్రారంభించారు. అయితే.. మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనుండటంతో.. విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు పలు పాఠశాలల్లో ఫేర్‌వెల్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఏ విధంగా మంచి మార్కులు సాధించాలి.. అనే విషయాలపై ఉపాధ్యాయులు సూచనలు చేస్తున్నారు. అయితే.. అలాంటి ఫేర్‌వేల్ పార్టీలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడం కలకలం రేపింది.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. ఫేర్‌వేల్ పార్టీలో వార్డెన్ అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయడంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. అంతేకాకుండా.. ఆశ్రమ పాఠశాల వార్డెన్‌పై వేటు వేశారు..

అసలేం జరిగిందంటే..

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠపురం బాలుర ఆశ్రమ పాఠశాలలో రెండు రోజుల క్రితం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డెన్ అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా వారితో తైతక్కలాడించాడు. వార్డెన్ చంద్రశేఖర్ సమక్షంలో అర్ధరాత్రి వరకు రికార్డింగ్ డ్యాన్సులు సాగాయి.. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు.

దీంతో విద్యా వ్యవస్థను అపహాస్యం చేసి పాఠశాలలో అశ్లీల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసిన ఘటనలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన డిడి విజయశాంతి.. నీలకంఠపురం బాలుర ఆశ్రమ పాఠశాల వార్డెన్ చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేశారు. దీనిపై వైసీపీ నేత పుష్ప శ్రీవాణి స్పందిస్తూ.. ట్వీట్ చేశారు.

వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..