HariHara Veeramallu : హరిహర వీరమల్లు సినిమాపై హైపర్ ఆది రివ్యూ.. ఏం చెప్పారంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సైతం తన రివ్యూ ఇచ్చారు. సినిమాలో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీపై అద్భుతంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.

దాదాపు రెండేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. బ్రో సినిమా తర్వాత పవన్ నటించిన లేటేస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. యానిమల్ ఫేమ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జూలై 24న భారీ హైప్ మధ్య అడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా. తాజాగా ఈ సినిమాపై హైపర్ ఆది రివ్యూ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఈ సినిమా పండగలాంటిదని అన్నారు. సినిమాపై రివ్యూ చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
” హరిహర వీరమల్లు ప్రీమియర్ షో చూశాను. సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కు మీరు తెచ్చుకున్న పేపర్స్ అయిపోతాయి. సినిమాలో ఇంకా హై ఇచ్చే సీన్స్ చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్.. అందుకు కీరవాణి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ హైతోనే మీరందరూ థియేటర్ నుంచి బయటకు వస్తారు. ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంతో సహా వెళ్లి వీరమల్లు చేసిన పోరాటాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలాసార్లు సెట్స్ కు వెల్లాను. పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు నచ్చే సినిమా తీయాలని ప్రతి సీన్ మీద కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఈరోజు అది స్క్రీన్ మీద కనిపించింది. క్లైమాక్స్ ప్రతి అభిమానిని కదిలించింది” అని అన్నారు.
అభిమానుల కోసం హిట్ దేవుడా అని కోరుకుంటే హరిహర వీరమల్లు వచ్చింది. అందరూ ధర్మం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ గారిని చూశారు.. ఆన్ స్క్రీన్ లో మాత్రం ధర్మం కోసం పోరాడుతున్న హరిహర వీరమల్లును కూడా చూసి ఎంజాయ్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన సినిమా జీవితంలో ఎప్పుడూ ఇవ్వని ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలాగే రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశారు. 30 సంవత్సరాల నుంచి పవన్ కళ్యామ్ గారు సినిమా ద్వారా మనల్ని అలరిస్తున్నారు. రాజకీయాల్లో ఎన్నో అవమానాలు పడ్డారు. కష్టాల్లో ఉన్నా ఎంతోమందిని ఆదుకున్నారు. అలాంటి వ్యక్తి ఎప్పుడో గానీ మనస్పూర్తిగా ఒక మాట అడగడు సినిమా చూడండి అని.. ఇంకో మూడు చిత్రాల తర్వాత మళ్లీ సినిమాలు చేస్తాడో లేదో తెలియదు. నేను మనస్పూర్తిగా చెబుతున్నాను.. ఆయనకు నాయకులతో వ్యతిరేకత ఉంటుంది కానీ ప్రజలందరినీ సమానంగా చూస్తాడు” అని అన్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!
Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..








