‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ రివ్యూ
నటీనటులు : రామ్ పోతినేని,నిధి అగర్వాల్,నభా నటేష్ దర్శకత్వం : పూరి జగన్నాధ్ నిర్మాతలు : ఛార్మి,పూరి జగన్నాధ్ సంగీతం : మణిశర్మ హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ రోజే […]

నటీనటులు : రామ్ పోతినేని,నిధి అగర్వాల్,నభా నటేష్
దర్శకత్వం : పూరి జగన్నాధ్
నిర్మాతలు : ఛార్మి,పూరి జగన్నాధ్
సంగీతం : మణిశర్మ
హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ
ఇస్మార్ట్ శంకర్(రామ్) హైదరాబాదులో పేరు మోసిన రౌడీ. సుపారీలు తీసుకుని పనులు చేస్తుంటాడు. హాయిగా తన లవర్ చాందిని(నభా నటేష్)తో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఓ సారి సుపారీ తీసుకుని ఓ పొలిటిషియన్‌ను చంపిన కేసులో జైలుకు వెళ్తాడు. అదే సమయంలో ఆ కేసును సిబిఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) ఇన్వెస్టిగేట్ చేస్తూ షూటౌట్ లో చనిపోతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి సిబిఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) మెమొరీను ఎక్కిస్తారు. అసలు శంకర్ మెదడులో మరో వ్యక్తి జ్ఞాపకాలను ఎందుకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.? పొలిటీషియన్ కాశీరెడ్డిని శంకరే చంపాడా? శంకర్‌కి సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్)కి సంబంధం ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా టికెట్లు బుక్ చేయాల్సిందే.
విశ్లేషణ :
పూరి జగన్నాథ్..టాలీవుడ్‌లో ఈ నేమ్‌కి ఉన్న బ్రాండ్ వేరు. మట్టిని తీసుకుని కుండను చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. తన మార్క్ డైలాగ్స్, మేనరిజమ్స్‌తో హీరో ఇమేజ్‌ని కంప్లీట్‌గా ఛేంజ్ చేస్తాడు. సినిమాలు హిట్ అవ్వొచ్చు, ప్లాప్ అవ్వొచ్చు..కానీ పూరి మాత్రం ఫెయిల్ అవ్వడు. పూరీ జగన్నాథ్ సినిమాల్లో కొన్ని రోజులుగా అసలు కథలే ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆయన కనీసం పట్టించుకోకుండా చుట్టేస్తున్నాడని అభిమానులు కూడా ఫీల్ అయ్యారు. చివరికి కొడుకుతో చేసిన ‘మెహబూబా’ సినిమా కూడా ఇలాగే ఉండటంతో ఫ్యాన్స్ హర్టయ్యారు. దాంతో చాలా టైమ్ తీసుకుని ఇస్మార్ట్ శంకర్ కథ రాసుకున్నాడు ఈ డాషింగ్ డైరక్టర్. ఈ సారి కాస్త కొత్త కథను కూడా పట్టుకొచ్చాడు.
ఈ సినిమాకి వచ్చినంత హైప్, ఈ మధ్య కాలంలో పూరి సినిమాల్లో దేనికి రాలేదు. మరి భారీ అంచనాల మధ్య పక్కా మాస్ మసాలా అంశాలతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొత్తానికి మాస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటుంది. అలాగే పక్కా తెలంగాణ యాసలో కొత్తగా ఉన్న సంభాషణలు, అలాగే రామ్ డైలాగ్ డెలివరీ, ఫుల్ ఎనర్జీ సాగే రామ్ యాక్టింగ్ అండ్ స్టెప్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రామ్ హిట్ కోసం మంచి ఆకలితో ఉన్నట్టు కనిపించాడు. ఆ కసి సినిమాలోని ప్రతి సీన్‌లో కనిపించింది. నభా నటేష్ గ్లామర్ షో అదిరిపోయింది.. నటన కూడా బాగుంది. నిధి కూడా గ్లామర్ షో గురించి చెప్పాల్సింది ఏముంది. మరో రేంజ్ అంతే. సత్యదేవ్ ఉన్నది కాసేపే అయినా కూడా అతడి మీదే కథ అంతా నడుస్తుంది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రల్లో బాగానే నటించారు.
టెక్నికల్ టీం:
పూరి టేకింగ్ గురించి స్పెషల్‌గాా ఏం చెప్తాం యాజ్ యూజ్‌వల్ చింపేశాడు. డైలాగ్స్ విషయంలో పెన్ను పదును మరింత పెంచాడు. మణిశర్మ మ్యూజిక్ అదిరిపోయింది. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ పిచ్చెక్కించింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఓకే. పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పలేం గానీ..మంచి కమ్ బ్యాక్.
ఫైనల్ థాట్:
పూరి కేవ్స్ నుంచి..పైసా వసూల్ మూవీ