పిచ్చోడ్నయ్యా.. ఓ పూరీ.. ఓ ఛార్మీ..!
రామ్‌తో డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ పిచ్చ టాక్ తెచ్చుకొని థియేటర్లలో దూసుకుపోతోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం యూత్‌కు కిక్ నిచ్చింది. దీంతో బీ, సీ సెంటర్లలో ఇస్మార్ట్ శంకర్ రచ్చ లేపుతున్నాడు. అంతేకాదు కలెక్షన్లలోనూ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. కాగా ఈ సినిమాను తాజాగా పూరీ జగన్నాథ్ గురువు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూశాడు. ఇక ఆ సినిమా అతడికి పిచ్చపిచ్చగా నచ్చేసింది. దీంతో తన ఆనందాన్ని […]

రామ్‌తో డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ పిచ్చ టాక్ తెచ్చుకొని థియేటర్లలో దూసుకుపోతోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం యూత్‌కు కిక్ నిచ్చింది. దీంతో బీ, సీ సెంటర్లలో ఇస్మార్ట్ శంకర్ రచ్చ లేపుతున్నాడు. అంతేకాదు కలెక్షన్లలోనూ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. కాగా ఈ సినిమాను తాజాగా పూరీ జగన్నాథ్ గురువు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూశాడు. ఇక ఆ సినిమా అతడికి పిచ్చపిచ్చగా నచ్చేసింది. దీంతో తన ఆనందాన్ని మూవీ యూనిట్‌తో సెలబ్రేట్ చేసుకొని దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Also Read:‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ రివ్యూ
ఆ వీడియోలో బీర్‌ను తనపై కుమ్మరించుకున్న వర్మ.. ‘‘నేనేం పిచ్చోడిని కాదు. కానీ ఇస్మార్ట్ శంకర్ నన్ను పిచ్చోడిని చేసింది. నాకు ఈ పరిస్థితి రావడం పూరీ జగన్నాథ్, ఛార్మీలే కారణం’’ అని ట్వీట్ చేశాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ చిత్ర యూనిట్ మొత్తం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. పూరీ ఈజ్ బ్యాక్ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
I am not mad , but #issmartshankar made me mad , so @purijagan and @Charmmeofficial are to blame pic.twitter.com/Sd1gIno1ER
— Ram Gopal Varma (@RGVzoomin) July 20, 2019
Also Read:రెండో రోజూ వసూళ్ల వరద…పూరి పునర్వైభవం