AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్ బాస్ 3’ వాయిదా..? నాగ్ సైలెన్స్ వెనుక నిజమెంత!

వివాదాలకు, సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షో. ఈ రియాలిటీ షో పలు భాషల్లో ఎంతోమంది అభిమానులకు చేరువైంది. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో సీజన్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆ రెండు సీజన్‌లకు లేనంతగా ఈ సీజన్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. దీనితో ఈ సీజన్ ప్రారంభం అవుతుందా.? లేదా అని సందేహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా సెలక్షన్ లో భాగంగా షో నిర్వాహకులు వేధింపులకు […]

'బిగ్ బాస్ 3' వాయిదా..? నాగ్ సైలెన్స్ వెనుక నిజమెంత!
Ravi Kiran
|

Updated on: Jul 20, 2019 | 4:42 PM

Share

వివాదాలకు, సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షో. ఈ రియాలిటీ షో పలు భాషల్లో ఎంతోమంది అభిమానులకు చేరువైంది. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో సీజన్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆ రెండు సీజన్‌లకు లేనంతగా ఈ సీజన్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. దీనితో ఈ సీజన్ ప్రారంభం అవుతుందా.? లేదా అని సందేహం వ్యక్తం అవుతోంది.

ముఖ్యంగా సెలక్షన్ లో భాగంగా షో నిర్వాహకులు వేధింపులకు పాల్పడ్డారంటూ పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో కేసులు వేయగా.. అది కాస్తా సీరియస్ ఇష్యూ అయింది. యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా.. ఇప్పటికే షో నిర్వాహకులపై కేసులు పెట్టడమే కాదు.. ఢిల్లీ మహిళా కమీషన్‌ను కలవడం కూడా పెద్ద సంచలనంగా మారింది. అటు ఉస్మానియా విద్యార్థులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి.. షోపై ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఓయూ విద్యార్థి నాయకులు ఫిర్యాదు చేశారు. సినీనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఓయూ విద్యార్థులు అక్కినేని నాగార్జున ఇంటిని కూడా ముట్టడించారు.

ఈ పరిణామాల నడుమ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున.. షో నిర్వాహకులతో మంతనాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ షో నుంచి ఆయన వైదొలిగినట్లు అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో బిగ్ బాస్ షోను నిలిపివేస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏమి వెలువడలేదు. ఇవాళ్టి నుంచి ప్రో కబడ్డీ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో.. వాటి ప్రోమోలే ప్రసారమవుతుండగా.. అటు `బిగ్ బాస్ 3` ప్రోమో ఎక్కడా కనిపించకపోవడంతో ఆడియెన్స్లోనూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దీనికి స్టార్ మా ఏం సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.

Follow Us