‘ఆమె’ మూవీ రివ్యూ!

టైటిల్ : ‘ఆమె’ తారాగణం : అమలాపాల్, ర‌మ్య సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌, శ్రీ‌రంజ‌ని, వివేక్ ప్ర‌స‌న్న తదితరులు సంగీతం : ప‌్ర‌దీప్ కుమార్ నిర్మాతలు : రాంబాబు క‌ల్లూరి, వియ్ మోర‌వెనేని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రత్నకుమార్ విడుదల తేదీ: 20-07-2019 తమిళ నటి అమలాపాల్ నటించిన తాజా చిత్రం ‘ఆడై’. ఈ సినిమా తెలుగులోకి ‘ఆమె’ పేరుతో డబ్ అయింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో పెద్ద సంచలనానికి కారణం […]

'ఆమె' మూవీ రివ్యూ!
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Jul 26, 2019 | 1:16 PM

టైటిల్ : ‘ఆమె’

తారాగణం : అమలాపాల్, ర‌మ్య సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌, శ్రీ‌రంజ‌ని, వివేక్ ప్ర‌స‌న్న తదితరులు

సంగీతం : ప‌్ర‌దీప్ కుమార్

నిర్మాతలు : రాంబాబు క‌ల్లూరి, వియ్ మోర‌వెనేని

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రత్నకుమార్

విడుదల తేదీ: 20-07-2019

తమిళ నటి అమలాపాల్ నటించిన తాజా చిత్రం ‘ఆడై’. ఈ సినిమా తెలుగులోకి ‘ఆమె’ పేరుతో డబ్ అయింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో పెద్ద సంచలనానికి కారణం అయింది. ఈ మూవీకి చెందిన టీజర్‌లో.. అమ‌లాపాల్ ఒంటి మీద నూలు పోగు లేకుండా న‌గ్నంగా క‌నిపించి అందరిని షాక్‌కు గురి చేసింది. అంతేకాదు ట్రైలర్‌లో ఆమె నటనపై నెటిజన్లు కొందరు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తే.. మరికొందరు ఆమెను సపోర్ట్ చేశారు. పలు ఇబ్బందులు, వివాదాల నడుమ నిన్న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పించగలిగిందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ‌ :

ఓ టీవీ ఛానల్‌లో పని చేసే కామిని(అమలాపాల్) పూర్తిగా వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుతూ, కేర్‌లెస్‌గా ఫ్రెండ్స్ అందరితో బెట్‌లు కడుతూ ఉంటుంది. స్నేహితులతో మద్యం, సిగరెట్, బైక్ రైడ్స్ ఇలా చేయాల్సిన పనులన్నీ చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఒక రోజు రాత్రి స్నేహితులు సిద్ధం చేసిన బర్త్‌డే పార్టీలో కామిని పీకలదాకా మద్యం సేవిస్తుంది. ఆ రాత్రి ఇంటికి రాని కూతురును వెతుకుతూ ఆమె తల్లి(శ్రీ‌రంజ‌ని) పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తుంది. ఇక ఆ తర్వాత కామిని ఓ పాడుబడ్డ బిల్డింగ్‌లో న్యూడ్‌గా కనిపిస్తుంది. ఆమెకు ఆ స్థితిలోనే మెలకువ రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఆమె ఆ బంగ్లాలోకి ఎలా చేరింది.? ఆ రాత్రి ఏమి జరిగింది.? ఆమె నగ్నంగా ఎందుకు పడి ఉంది.? అనే ప్రశ్నలకు సమాధానం వెండి తెరపై చూడాల్సిందే.

న‌టీన‌టుల అభినయం:

ప్రధాన పాత్ర కామినిగా అమలాపాల్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ఆమె తన నటనా విశ్వరూపాన్ని చూపిందని చెప్పవచ్చు. సినిమాలోని ప్రతి సీన్ ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి భాగంలో కామిని జీవనశైలిని చూపించిన దర్శకుడు.. రెండో భాగంలో ప్రతి సన్నివేశానికి సస్పెన్స్ జత చేస్తూ అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇక హీరోయిన్‌కు తల్లి పాత్రలో నటించిన శ్రీ‌రంజ‌ని తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇకపోతే మిగిలిన నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేష‌ణ‌ :

‘ఆమె’ సినిమా లేడి ఓరియెంటెడ్ అయినా.. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. ముఖ్యంగా అతడు ప్రతి సన్నివేశాన్ని రక్తికట్టించే విధంగా చూపించడంలో సఫలమయ్యాడని చెప్పవచ్చు. అంతేకాకుండా డైరెక్టర్ రత్నకుమార్ సమాజానికి మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ సినిమా పట్ల వచ్చిన వివాదాలన్నీ పటాపంచలయ్యేలా చూడడంలో సక్సెస్ అయ్యాడు.

సాంకేతిక విభాగాల పనితీరు:

రత్నకుమార్ ఎంచుకున్న స్క్రిప్ట్ లేడి ఓరియెంటెడ్‌ను మించి ఉందని చెప్పవచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినా.. మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు. ఈ సినిమాలో సంగీతానికి ప్రాముఖ్యత లేకపోయినా .. బ్యాగ్రౌండ్ స్కోర్ కు మంచి మార్కులు వేయవచ్చు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • అమలాపాల్ నటన
  •  సోషల్ మెసేజ్

మైనస్‌ పాయింట్స్‌ :

  • సాగదీత సీన్స్
  • అక్కడక్కడా మందగమనంగా సాగిన కథనం