Nani: నాని రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు.. ఒక్కొక్క సినిమాకు ఎంతంటే..
ఊర మాస్ మసాలా సినిమాగా వస్తోన్న ఈ మూవీలో నాని మునుపెన్నడూ చేయని పాత్ర చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తోన్న దసరా సినిమాలో బొగ్గు కార్మికుడిగా కనిపించనున్నాడు.

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. చివరిగా వచ్చిన అంటే సుందరానికి సినిమా తేడా కొట్టడంతో ఇప్పుడు దసరా సినిమా పై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఊర మాస్ మసాలా సినిమాగా వస్తోన్న ఈ మూవీలో నాని మునుపెన్నడూ చేయని పాత్ర చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తోన్న దసరా సినిమాలో బొగ్గు కార్మికుడిగా కనిపించనున్నాడు. నాని తెలంగాణ నేపథ్యంలో నటిస్తోన్న చిత్రం కావడం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఏ కథను చెప్పనున్నాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు పేక్షుకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తో తనకు సాలిడ్ హిట్ వస్తుందని ధీమాగా ఉన్నాడు నాని.
ఇక ఈ సినిమా తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని- తండ్రీకూతుళ్ల బాండింగ్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి – డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల – మూర్తికె.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శౌర్యువ్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో నానికి జోడీగా అందాల భామ మృణాల్ ఠాకుర్ నటిస్తోంది.
ఇదిలా ఉంటే నాని తన రెమ్యునరేషన్ ను పెంచేశారని టాక్ వినిపిస్తోంది. నాని ప్రస్తుతం ఒక సినిమా కోసం 22 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. అందుకునే నిర్మాతలు కూడా నాని రెమ్యునరేషన్ కు ఓకే చెప్తున్నారని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
