Allari Naresh: మళ్లీ కామెడీ వైపు యూ టర్న్.. అల్లరి నరేష్ ఆ దర్శకుడితో సినిమా చేస్తున్నాడా..?

అల్లరి నరేష్ అంటే కేర్ ఆఫ్ కామెడీ.. కానీ ఆ ముద్ర నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఈ హీరో. ఈ నేపథ్యంలోనే కామెడీ వదిలేసి ఈ మధ్య సీరియస్ బాట పట్టారు.

Allari Naresh: మళ్లీ కామెడీ వైపు యూ టర్న్.. అల్లరి నరేష్ ఆ దర్శకుడితో సినిమా చేస్తున్నాడా..?
Allari Naresh
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 08, 2023 | 7:47 AM

అల్లరి నరేష్ మళ్లీ కామెడీ వైపు వస్తున్నారా..? కొన్నేళ్లుగా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న నరేష్.. మళ్లీ తన సేఫ్ జోన్ లోకి రావాలని చూస్తున్నారా..? సీరియస్ సినిమాలు చేసినా పర్లేదు.. మధ్యలో అప్పుడప్పుడూ కామెడీ చేయాలంటున్న అభిమానుల కోరికను ఆయన మన్నించారా..? మరి దీనికోసం ఆయన ఎంచుకుంటున్న దర్శకుడు ఎవరు..? అసలు ప్రస్తుతం నరేష్ ఎన్ని సినిమాలు చేస్తున్నారు..?

అల్లరి నరేష్ అంటే కేర్ ఆఫ్ కామెడీ.. కానీ ఆ ముద్ర నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఈ హీరో. ఈ నేపథ్యంలోనే కామెడీ వదిలేసి ఈ మధ్య సీరియస్ బాట పట్టారు. రెండేళ్ల కింద నాంది సినిమాతో మంచి విజయం అందుకున్న ఈయన.. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటూ వచ్చారు. ప్రస్తుతం ఉగ్రం సినిమాలో నటిస్తున్నారు అల్లరి నరేష్. ఇది కూడా పూర్తిగా సీరియస్ డ్రామా. సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.

నరేష్ వరుసగా సీరియస్ సబ్జెక్ట్స్ చేయడంతో.. ఆయన నుంచి వచ్చే కామెడీని మిస్ అవుతున్నారు అభిమానులు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నరేష్ మరోసారి తన జోనర్ లోకి రావాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే మంచి కథ కోసం వెయిట్ చేస్తున్న నరేష్ కు.. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ అదిరిపోయే కామెడీ లైన్ చెప్పాడని తెలుస్తోంది. ప్రిన్స్ తర్వాత ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు అనుదీప్.

సెటైరికల్ కామెడీస్ చేయడంలో అల్లరి నరేష్ ఎప్పటి నుంచో ముందున్నాడు. ఇలాంటి హీరోకి అనుదీప్ లాంటి దర్శకుడు తోడైతే వచ్చే ఔట్ పుట్ అదిరిపోతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. అన్ని వర్కౌట్ అయ్యి ఈ కాంబినేషన్ కానీ సెట్స్ పైకి వచ్చిందంటే.. కామెడీ లవర్స్ కు అంతకంటే ఫీస్ట్ ఉండదు. ఆ మధ్య వెంకటేష్ తో సినిమా కోసం ట్రై చేసిన అనుదీప్.. అది వర్కౌట్ అవ్వకపోవడంతో అల్లరి నరేష్ వైపు వస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!