Jr NTR: ఆస్కార్ కోసం అమెరికాలో తారక్.. మరి కొరటాల శివ సినిమా మొదలయ్యేది ఎప్పుడు.?
నందమూరి కుటుంబంలో జరిగిన అనుకొని విషాదం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల కోసం అమెరికా ఆన్ టైం వెళ్లలేక పోయారు. దాంతో కాస్త ముందుగానే రామ్ చరణ్ యుఎస్ వెళ్లి అవార్డు ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
కొన్ని రోజులుగా రామ్ చరణ్ ఒక్కడే అమెరికాలో ఆస్కార్ అవార్డుల్లో సందడి చేస్తుంటే నందమూరి అభిమానులు ఎక్కడో తెలియని అసంతృప్తి మాత్రం కనిపిస్తూనే ఉంది. దీనిపై సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ కూడా జరిగింది. ఇప్పుడు ఇక ఈ యుద్ధాలతో పనిలేదు. ఆస్కార్ కోసం ఎన్టీఆర్ కూడా కదిలారు. మార్చి 12న జరగబోయే అవార్డుల వేడుక కోసం ఆర్ఆర్ఆర్ యూనిట్ తో జాయిన్ అయ్యారు తారక్. మరి ఎన్టీఆర్ యూఎస్ ట్రిప్ ఎన్ని రోజులు..? కొరటాల సినిమా షూటింగ్ మొదలయ్యేదెప్పుడు..?
నందమూరి కుటుంబంలో జరిగిన అనుకొని విషాదం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల కోసం అమెరికా ఆన్ టైం వెళ్లలేక పోయారు. దాంతో కాస్త ముందుగానే రామ్ చరణ్ యుఎస్ వెళ్లి అవార్డు ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే రాజమౌళి, కీరవాణి మిగిలిన చిత్ర యూనిట్ కూడా అమెరికా వెళ్లారు. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఇండియాలో మిగిలిపోయారు. మార్చి 2న తారక రత్న పెద్దకర్మ పూర్తి కావడంతో తారక్ కూడా యూఎస్ వెళ్లారు.
తారకరత్న మరణం కారణంగా ఫిబ్రవరి 24న మొదలవ్వాల్సిన కొరటాల సినిమా వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మార్చ్ లోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ లోపు అమెరికా వెళ్లి రానున్నారు తారక్. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఆర్ఆర్ఆర్ దీనికి నామినేట్ కావడంతో చిత్ర యూనిట్ అందరూ ముందే అక్కడికి చేరుకున్నారు.
ఆస్కార్ అవార్డుల కోసం కేవలం రామ్ చరణ్ ఒక్కడే అమెరికా వెళ్లడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ బాగా గట్టిగా జరిగింది. తారక్ అభిమానుల పేరుతో కొందరు ట్రోలింగ్ బాగానే చేశారు. దీనిపై హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ కూడా స్పందించింది. అలాంటిదేమీ లేదని.. జూనియర్ ఎన్టీఆర్ కోసం కూడా ఒక అవార్డు వేచి చూస్తుందని వాళ్ళు ట్వీట్ చేశారు.తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అమెరికా వెళ్లడంతో వివాదానికి తెరపడింది. రాబోయే వారం రోజులు ఈయన కూడా అక్కడే ఉండబోతున్నారు. మార్చి మూడో వారంలో ఇండియాకు వచ్చిన తర్వాత కొరటాల శివ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల.