AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Tillu : చాలా మంది కమెడియన్లు వల్ల కానిది వేణు వల్ల అయ్యింది.. నువ్వు గ్రేట్ గురూ

బలగం.. టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఈ చిత్రం. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాతో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమయ్యారు. సాధారణంగా కమెడియన్ డైరెక్టర్‌గా మారితే..

Venu Tillu : చాలా మంది కమెడియన్లు వల్ల కానిది వేణు వల్ల అయ్యింది.. నువ్వు గ్రేట్ గురూ
Venu Tillu
Rajeev Rayala
|

Updated on: Mar 08, 2023 | 9:58 AM

Share

నటులు దర్శకులుగా మారడం కొత్తేం కాదు.. కానీ కమెడియన్లు మెగాఫోన్ పట్టి హిట్ కొట్టడం మాత్రం నిజంగానే పెద్ద విషయం. ఎందుకంటే టాలీవుడ్‌లో ఇప్పటి వరకు డైరెక్టర్‌గా సక్సెస్ కమెడియన్ ఒక్కరు కూడా లేరు. కానీ ఈ రికార్డు ఇప్పుడు అందుకున్నారు వేణు. ఈయన బలగంకు పైసలతో పాటు ప్రశంసలు బాగానే వస్తున్నాయి.

బలగం.. టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఈ చిత్రం. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాతో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమయ్యారు. సాధారణంగా కమెడియన్ డైరెక్టర్‌గా మారితే.. అతడి నుంచి కామెడీ కథనే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ కన్నీరు పెట్టించే కథతో బలగంను ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లా తెరకెక్కించారు వేణు.

తెలంగాణ నేపథ్యంలో వచ్చిన బలగం చిత్రానికి కలెక్షన్లతో పాటు ప్రశంసలు దక్కుతున్నాయి. పైగా మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. దాంతో డైరెక్టర్‌గా సక్సెస్ అయిన తొలి కమెడియన్‌గా వేణు చరిత్ర సృష్టించారు. గతంలో వెన్నెల కిషోర్ జప్ఫా, వెన్నెల వన్ అండ్ హాఫ్ లాంటి సినిమాలతో డిజాస్టర్స్ ఇచ్చారు.

సీనియర్ కమెడియన్లు ఎమ్మెస్ నారాయణ కూడా కొడుకు, భజంత్రీలు లాంటి సినిమాలు తెరకెక్కించినా ఫలితం శూన్యం. అలాగే ధర్మవరపు సుబ్రమణ్యం సైతం తోకలేనిపిట్ట లాంటి సినిమాలు చేసి నిరాశ పరిచారు. ఇక కృష్ణ భగవాన్ జాన్ అప్పారావ్ 40 ప్లస్‌తో మెగాఫోన్ పట్టినా హిట్ కొట్టలేదు. చివరికి వేణు ఈ రికార్డు అందుకున్నారు.