Akhil movie: చరణ్ కోసం రాసుకున్న కథతో అఖిల్ సినిమా.. ఆసక్తికర విషయాలు తెలిపిన రచయిత..
అక్కినేని యంగ్ హీరో అఖిల్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సాలిడ్ సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోతున్నాడు.

Akhil movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సాలిడ్ సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించిన అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివివినాయక్ డైరెక్షన్లో చేసాడు అఖిల్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో సినిమా చేసాడు ఈ సినిమాకూడా ఆడలేదు. ఆతర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమాతో వచ్చాడు. ఈ సినిమాకూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
అయితే అఖిల్ నటించిన మొదటి సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాతో హీరోయిన్ సాయేషా సైగల్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాను గురించి రచయిత వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.. ‘అఖిల్’ సినిమా కథను తాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ అని వెలిగొండ శ్రీనివాస్ అన్నాడు . అప్పటికే చరణ్ స్టార్ హీరోగా చాలా బిజీగా ఉన్నారని, అప్పటికే చారం కు స్టార్ డమ్ వచ్చేసిందని. అందువలన ఆయన క్రేజ్ కి తగిన విధంగా కథను రాసుకున్నాను అని చెప్పారు. కానీ అఖిల్ దగ్గరికి వచ్చేసరికి కథలో కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. మొదటి సినిమా కావడం వలన అఖిల్ ను ఆ కథలో మరింత హైలైట్ చేస్తూ చూపించవలసి వచ్చింది. అందువలనే సినిమా కథ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని నేను అనుకుంటున్నా… చరణ్ తో ఈ కథను చేసి ఉంటే మరోలా ఉండేది” అంటూ చెప్పుకొచ్చారు వెలిగొండ శ్రీనివాస్.
మరిన్ని ఇక్కడ చదవండి :
