AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నుంచి కోలుకున్న రియల్ హీరో.. నెగిటివ్ అంటూ పాజిటివ్‏ షేడ్‏లో చెప్పిన సోనూ సూద్..

Sonu Sood: కరోనా కాలంలో వలస కార్మికులకు సహయం చేసి.. రియల్ హీరోగా మారాడు సోనూసూద్. వేలాది మంది వలస

కరోనా నుంచి కోలుకున్న రియల్ హీరో.. నెగిటివ్ అంటూ పాజిటివ్‏ షేడ్‏లో చెప్పిన సోనూ సూద్..
Sonu Sood
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2021 | 12:04 PM

Share

Sonu Sood: కరోనా కాలంలో వలస కార్మికులకు సహయం చేసి.. రియల్ హీరోగా మారాడు సోనూసూద్. వేలాది మంది వలస కార్మికులకు లాక్ డౌన్ సమయంలో వాహనాలను అందించడమే కాకుండా.. వారి జీవనానికి కావల్సిన డబ్బును అందించి… ఎంతో మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇటీవల అదే కరోనా మహమ్మారి బారిన పడ్డారు సోనూసూద్. ఈ రియల్ హీరో.. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనూ కరోనా బారిన పడినప్పటి నుంచి ఆయన కోలుకోవాలని అభిమానులు దేవుళ్ళను ప్రార్థించగా.. తాజాగా ఆయనకు నెగిటివ్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు.

‘‘ఆక్సిజన్, రెమిడెసివిర్, బెడ్స్‌’’ ఉదయం లేచిన దగ్గర్నుంచీ, అర్ధరాత్రి నుండి మరుసటి ఉదయం వరకు ఈ 3 పదాలే తనకు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో కొన్నిసార్లు పాస్ అవుతున్నా, మరి కొన్నిసార్లు విఫలమవుతున్నా..అయినా ప్రయత్నిస్తూనే ఉంటాను. దేవుడు అందరినీ చల్లగా చూడాలంటూ సోనూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఆగస్టు 15 న దేశభక్తిని చూపించే వారికి ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇచ్చారు. దేశం కోసం ఏదైనా చేయటానికి , దేశభక్తిని చూపించడానికి ఇంతకు మించిన సమయం లేదు స్పందించాలంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ రియల్ హీరో… మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. భయపడకండి.. మరింత సేవ చేసేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందంటూ ట్వీట్ చేశాడు.

ట్వీట్..

Also Read: HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..

PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో లేదో తెలుసుకోండి.. ఎలా చెక్ చెయాలంటే..

Covid Scare Rising: మీకు కరోనా సోకిందా.. అయితే ఆరోగ్య భీమా ఎంత ఉండాలో తెలుసా..