Vijay Deverakonda: ఇన్‌స్టా ఫాలోవర్స్ విషయంలో సౌత్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ
పాన్ ఇండియా మార్కెట్‌ను మార్చేసే టాప్ హీరోలు.. మాస్ మేనియాతో థియేటర్లను ఊపేసే క్రేజీ హీరోలు. ఇలా టాలీవుడ్‌లో టాప్ హీరోలు చాలా మంది ఉన్నా..
Vijay Deverakonda :
పాన్ ఇండియా మార్కెట్‌ను మార్చేసే టాప్ హీరోలు.. మాస్ మేనియాతో థియేటర్లను ఊపేసే క్రేజీ హీరోలు. ఇలా టాలీవుడ్‌లో టాప్ హీరోలు చాలా మంది ఉన్నా… విజయ్ దేవరకొండను మాత్రం బీట్ చేయలేకపోతున్నారు. ఏ విషయం ఎలా ఉన్నా.. అక్కడ మాత్రం నాదే హవా అంటున్నారు రౌడీ బాయ్. ఇంతకీ విజయ్ టాప్ ప్లేస్ కబ్జా చేసిన ప్లేస్ ఏంటి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, డార్లింగ్ ప్రభాస్, రామ్ చరణ్.. ఇంకా ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నా… సోషల్ మీడియాలో మాత్రం విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాలో విజయ్ క్రేజ్ చూసి ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అవుతున్నారు. అసలు రౌడీ బాయ్‌కి ఈ రేంజ్ క్రేజ్ రావడానికి కారణమేంటి? ప్రజెంట్ విజయ్ దేవరకొండకు ఇన్‌స్టాలో కోటి 14 లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. కోటి 13 లక్షలతో అల్లు అర్జున్ ఒక్కరే విజయ్‌కి కాస్త దగ్గరలో ఉన్నారు. మరే టాలీవుడ్ హీరో కూడా విజయ్ దేవరకొండ దరిదాపుల్లో కూడా లేరు. అయితే ఈ యంగ్ హీరోకు ఈ రేంజ్‌క్రేజ్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్‌కు ఆడియన్స్ ఫిదా అవ్వటంతో క్రేజ్ ఓ రేంజ్‌కు చేరింది. బాలీవుడ్‌లోనే రౌడీ బాయ్ క్రేజ్ మామూలుగా లేదు. నార్త్ స్టార్ కిడ్స్ కూడా విజయ్ ఫ్యాన్స్ లిస్ట్‌లో చేరిపోయారు. జూనియర్ అతిలోకసుందరి జాన్వీ కపూర్ నుంచి యంగ్ సెన్సేషన్ అలియా భట్ వరకు చాలా మంది క్యూటీస్ విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందటూ ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. దీంతో విజయ్ పేరు నార్త్‌లో కూడా మోతమోగిస్తోంది. రౌడీ బాయ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ పెరగటానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు విశ్లేషకులు.
అంతేకాదు… మిగతా హీరోలతో పోలిస్తే సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉంటారు విజయ్ దేవరకొండ. తన సినిమా అప్‌డేట్స్, పర్సనల్ ట్రిప్స్ విశేషాలు కూడా రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటారు. దీనికితోడు సోషల్ రెస్పాన్సిబులిటీతో విజయ్ చేసే స్టేట్‌మెంట్స్ కూడా రౌడీ ఫాలోయింగ్‌ను ఓ రేంజ్‌లో పెంచేస్తున్నాయి. ఇన్‌స్టా ఫాలోవర్స్ విషయంలో ఇప్పటికే సౌత్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న విజయ్ దేవరకొండ, ముందు ముందు నార్త్ స్టార్స్‌కు కూడా పోటి ఇస్తారేమో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :