Salman Khan: సౌత్ సినిమా సాంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దబంగ్ 3 తర్వాత భాయ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు.

Salman Khan: సౌత్ సినిమా సాంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 23, 2021 | 9:42 PM

Salman Khan:

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దబంగ్ 3 తర్వాత భాయ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ  సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా కన్నడ స్టార్ హీరో సుదీప్ విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే సౌత్ కథల మీదే కాదు… సౌత్ మ్యూజిక్‌ మీద కూడా సల్మాన్‌ ఖాన్‌కి స్పెషల్ ఇంట్రస్ట్‌. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతీసారి సౌత్‌ సూపర్‌ హిట్స్ సాంగ్స్‌ను తన సినిమాల కోసం రిమిక్స్ చేస్తున్నారు ఈ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌. తాజాగా రాధే సినిమా కోసం కూడా ఓ క్రేజీ సాంగ్‌ను రీమిక్స్‌ చేశారు. బన్నీ డ్యాన్స్‌ ఇరగదీసిన ఓ పాటను తనదైన స్టైల్‌లో యూజ్‌ చేసుకుంటున్నారు.

అల్లు అర్జున్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథమ్‌. ఈ సినిమాలోని సీటీమార్‌ సాంగ్‌ను హుక్‌లైన్స్‌తో సహా యాజిటీజ్‌గా రాధే సినిమాలో యూజ్‌ చేశారు మేకర్స్‌. దీంతో మరోసారి డీజే పాట సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. గతంలోనూ బన్నీ పాటకు స్టెప్పేశారు సల్లూ భాయ్‌. రామ్‌ నటించిన రెడీ సినిమాను అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్‌ చేసిన భాయ్‌… ఆ సినిమాలో ఆర్య 2 సూపర్‌ హిట్ నెంబర్‌ రింగ రింగాను రిమిక్స్‌ చేశారు. ఆ పాట కూడా బాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు సీటీమార్‌ కూడా అదే రేంజ్‌లో సక్సెస్‌ అవుతుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో హీరోయిన్ అరెస్ట్

తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ ఇంద్రజ.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదంటూ..

సోషల్ మీడియాలో ఎన్టీఆర్ హవా.. యూట్యూబ్‏లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న RRR టీజర్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ రచ్చ..