తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ ఇంద్రజ.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదంటూ..

Actress Indraja: ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్‏గా వెలిగిన ఇంద్రజ.. ప్రస్తుతం జబర్ధస్త్ కామెడీషోలో జడ్జీగా వ్యవహరిస్తోంది

తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ ఇంద్రజ.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదంటూ..
Indraja
Rajitha Chanti

|

Apr 23, 2021 | 3:31 PM

Actress Indraja: ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్‏గా వెలిగిన ఇంద్రజ.. ప్రస్తుతం జబర్ధస్త్ కామెడీషోలో జడ్జీగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా పలు సినిమాల్లో నటిస్తూ రీఎంట్రీని కూడా ఎంజయ్ చేస్తోంది. తాజాగా తన లవ్ స్టోరీ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకోచ్చారు. నేను తెలుగు బ్రహ్మిణ్ అమ్మాయిని.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. మా ఆయన ముస్లిం. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదు. ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం. మతం చూసి, కులం చూసి ఇష్టపడం కదా.. నేను చెప్తే సినిమా డైలాగ్‌లా ఉంటుంది కానీ.. ఇది మాత్రం సినిమా డైలాగ్ కాదు. ఇది నా రియల్ లైఫ్ డైలాగ్ అంటూ తన వైవాహిక జీవితం గురించి చెప్పారు.

మా ప్రేమ, పెళ్లి ఎలా జరిగాయంటే.. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. మేం ఇద్దరం ఫ్రెండ్స్‌గా ఆరేళ్లు ఉన్నాం.. పరిచయం అయిన వెంటనే పెళ్లి చేసుకోలేదు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం.. అర్థం చేసుకోవడం జరిగాయి. అతను నాకు పూర్తిగా సపోర్ట్ ఉంటాడనే నమ్మకం కలిగింది. అదే నమ్మకం ఆయనకి కూడా కలిగి ఉండొచ్చు. అందుకే పెళ్లి చేసుకున్నాం. ఆయనకు ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్నాయి. ఆయన రచయిత. కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. అంతేకాదు. ఆయన యాడ్ ఫిల్మ్ మేకర్. మా మామయ్య వాళ్ళకి బిజినెస్ ఉంది. గవర్నమెంట్ ఎక్స్ పోర్ట్. ఆయన వాళ్ళ అన్నయ్య కాలిఫోర్నియాలో ఉంటారు. ఆయన సౌత్ ఎషియన్ కంట్రీస్ ఇక్కడి నుంచి మమా ఆయన, మావయ్య చూసుకుంటారు. ఆయన అక్కడ చూసుకుంటారు. ఇద్దరం కలిసి సినిమాల గురించి మాట్లాడుకుంటాం. ఆయన రాసిన కథని మలయాళంలో దర్శకుడు శ్రీనివాస్ గారు తీసుకున్నారు. అలాగే నా సినిమాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతుంటారు. కానీ నాకు లిమిట్స్ ఏం పెట్టారు అంటూ చెప్పారు ఇంద్రజ.

Also Read: ఆక్సిజన్ సిలిండర్స్ పంపిస్తానన్న సుస్మితా సేన్.. నెటిజన్స్ ట్రోల్స్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హీరోయిన్..

Anasuya: చిన్నపిల్లగా మారిపోయిన అనసూయ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ధీటుగా స్పందించిన రంగమ్మాత్త..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu