Tamannaah: మరో సారి ‘ఆహా’ అనిపించనున్న మిల్కీ బ్యూటీ.. ఈసారి సరికొత్త ప్రోగ్రాంతో..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌తో సామ్‌జామ్‌, రానా ద‌గ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్‌తో, ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ క్రాక్‌, అల్ల‌రి నరేష్ నాంది వంటి డిఫ‌రెంట్

Tamannaah: మరో సారి 'ఆహా' అనిపించనున్న మిల్కీ బ్యూటీ.. ఈసారి సరికొత్త ప్రోగ్రాంతో..
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 24, 2021 | 8:57 AM

Tamannaah: టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌తో సామ్‌జామ్‌, రానా ద‌గ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్‌తో, ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ క్రాక్‌, అల్ల‌రి నరేష్ నాంది వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ ఇప్పుడు మరో ప్రోగ్రాంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అగ్రనిర్మాత అల్లు అరవింద్ పర్యవేక్షణలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్. లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులను అలరించి మంచి పేరును సొంతం చేసుకుంది ఆహా. ఇప్పుడు సినిమా థియేటర్స్ తిరిగి ఓపెన్ అయ్యి అన్ని సాధారణ స్థితికి వస్తున్నాయి అనుకున్న సమయానికి మళ్లీ కరోనా విజృంభవించింది. దాంతో తిరిగి లాక్ డౌన్ దిశగా సాగుతుంది దేశం. ఈ నేపథ్యంలో ప్రజలను అలరించడానికి మరో క్రేజీ ప్రోగ్రాంతో సిద్దమవుతుంది ఆహా.

ఇటీవల తమన్నాతో ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ నిర్మించింది ఆహా. ఈ వెబ్ సిరీస్ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆమెతో మరో ఇంటరెస్టింగ్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుందట. అంతేగాక ఎలాగో ఆహాలో టాక్ షోలు కూడా సక్సెస్ అవుతున్నాయి. ఇటీవలే సామ్ జామ్ ప్రోగ్రాం కూడా సక్సెస్ అయింది. దాంతో ఓ తమన్నా తో ఓ టాక్ షోను కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. చూడాలి మరి ఈసారి ఆహా ప్రేక్షకులను ఎలా మెప్పించనుందో…

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: కోలీవుడ్ కు పూజాహెగ్డే.. బుట్టబొమ్మకు పట్టుకున్న కొత్త బెంగ.. కారణం ఇదే..

Salman Khan: సౌత్ సినిమా సాంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..

Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో హీరోయిన్ అరెస్ట్