AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parineeti Chopra’s Saina : ఓటీటీలో రిలీజ్ అయిన బ్యాడ్మింటన్ స్టార్ బయోపిక్..

'లేడీస్‌ వర్సెస్‌ రికీ భాల్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార పరిణితి చోప్రా. తొలి సినిమాతోనే తన నటనతో బీ-టౌన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ

Parineeti Chopra's Saina : ఓటీటీలో రిలీజ్ అయిన బ్యాడ్మింటన్ స్టార్ బయోపిక్..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 24, 2021 | 8:22 AM

Share

Parineeti Chopra’s Saina : ‘లేడీస్‌ వర్సెస్‌ రికీ భాల్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార పరిణితి చోప్రా. తొలి సినిమాతోనే తన నటనతో బీ-టౌన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన నటిగా ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యిందంటేనే ఈ అందాల తార క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ఈ అమ్మడు ఓ బయోపిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ ఇండస్ట్రీలో ఇటీవల ప్రముఖుల బయోపిక్‏లో హావా నడుస్తోంది. ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీలో హీరో సూర్య ప్రముఖ ఎయిర్‌ దక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితంలోని అంశాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇటు బీటౌన్ లో కూడా బయోపిక్‏ల హావా నడుస్తోంది. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ లో తొలి ఒలంపిక్ పతకం సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథపై సైనా అనే సినిమాను నిర్మించారు. ఇందులో సైనాగా  పరిణితీ చోప్రా నటిస్తోంది.  అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యింది. నిజానికి గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడి మొత్తానికి ఈ ఏడాది మార్చ్ 26న దేశవ్యాప్తంగా విడుదలైంది. కానీ సైనా రిలీజ్ సమయంలో థియేటర్స్ 50% అక్యూపెన్సీతో రన్ అవ్వడంతో సైనాకు కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేదు. ఇప్పడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పడు సైనా బయోపిక్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో హీరోయిన్ అరెస్ట్

Salman Khan: సౌత్ సినిమా సాంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..

Pooja Hegde: కోలీవుడ్ కు పూజాహెగ్డే.. బుట్టబొమ్మకు పట్టుకున్న కొత్త బెంగ.. కారణం ఇదే..

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి