Family Man Season-2: త్వరలో ప్రేక్షకుల ముందుకుఫ్యామిలీ మెన్ సీజన్ 2.. రిలీజ్ ఎప్పుడంటే..

ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు హావ కూడా కొనసాగుతుంది.  ఓటీటీ వేదికగా పలు వెబ్ సిరీసులు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి.

Family Man Season-2: త్వరలో ప్రేక్షకుల ముందుకుఫ్యామిలీ మెన్ సీజన్ 2.. రిలీజ్ ఎప్పుడంటే..
కానీ ఇప్పుడు  హిందీలో 'ఫ్యామిలీ మేన్' వెబ్ సిరీస్ చేస్తోంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ వివాదాల వలయంలో చిక్కుకుంది. 
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 25, 2021 | 9:23 AM

family man: ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు హావ కూడా కొనసాగుతుంది.  ఓటీటీ వేదికగా పలు వెబ్ సిరీసులు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. ఇక హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లు చేయడానికి మక్కువ చూపుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్. అక్కినేని కోడలు డిజిటల్‌ డెబ్యూ ఇంకా పూర్తిగా జరగకపోయినా, అప్పుడే అందరి ఐబాల్‌ అటెన్షన్‌నీ తనవైపు తిప్పుకుంటున్నారు. అంతా అనుకున్న టైమ్‌కే జరిగి ఉంటే, ఈ పాటికే రిలీజ్‌ కావాల్సింది ది ఫ్యామిలీ మెన్‌ 2 వెబ్‌సీరీస్‌. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్‌ సీజన్‌లో కాస్టింగ్‌ కూడా గ్రాండ్‌గానే ఉంది. ప్రియమణి, సమంత వంటి స్టార్ కాస్ట్ తో మేజిక్‌ చేశారు రాజ్‌ అండ్‌ డీకే. ఫ్యామిలీ మెన్ పార్ట్ 1 ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పార్ట్ 2 ను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈసారి ఫ్యామిలీ మ్యాన్ తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో మనోజ్ బాజ్పేయి ఎన్ఐఏ ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా నటించగా..  సమంత ఉగ్రవాది పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే టీజర్ తో మేకర్స్ భారీ అంచనాలను క్రియేట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ వెబ్ సిరీస్ మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. నిజానికి ఈ వెబ్ సిరీస్ సెకండ్ పార్ట్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని వివాదాస్పద సన్నివేశాలు ఉండటంతో వాటిని రీషూట్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆలస్యం అయ్యిందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Shyam Singha Roy : ‘కాళికాదేవి’ ఆలయం సెట్ లో నేచురల్ స్టార్ శ్యామ్ సింగ రాయ్ షూటింగ్..

Pawan Kalyan: హాట్ టాపిక్ గా వకీల్ సాబ్ రెమ్యునరేషన్.. పవన్ ఎంత అందుకున్నారో తెలుసా..

Dhanush: ఓటీటీ వేదికగా ధనుష్ ‘జగమే తంతిరమ్’ సినిమా.. ఎప్పుడంటే