Nagarjuna’s ‘Wild Dog’ : ఓటీటీలో విడుదలై రికార్డులు సృష్టిస్తున్న కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్..

సీనియర్ హీరోల్లో కింగ్ నాగార్జున స్టైలే వేరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు నాగార్జున. ఇటీవల  వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ్.

Nagarjuna's 'Wild Dog' : ఓటీటీలో విడుదలై రికార్డులు సృష్టిస్తున్న కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్..
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 26, 2021 | 8:47 AM

Nagarjuna’s ‘Wild Dog’ :

సీనియర్ హీరోల్లో కింగ్ నాగార్జున స్టైలే వేరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు నాగార్జున. ఇటీవల  వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అషిషోర్ సోలోమెన్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాడు. హైదరాబాద్‏లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించగా.. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్‏కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. నాగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్‏గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో సయామీ ఖేర్ కీలక పాత్రలో నటించింది.తాజాగా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసింది చిత్రయూనిట్. ఏప్రిల్ 21 అర్థరాత్రి నుంచి వైల్డ్ డాగ్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన 19 రోజుల్లోనే నాగార్జున సినిమాలో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో విడుదలైన 40-45 రోజులలో తమ వైల్డ్ డాగ్ సినిమా OTTలో విడుదల అవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే ఇప్పుడు ఇంత త్వరగా ఉన్నట్లుండి ఓటీటీలోకి తీసుకొస్తుండటం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఓటీటీల్లోనే అగ్రస్థానంలో నిలిచింది ఈ సినిమా . భారతదేశంలోనే కాదు అమెరికా.. బ్రిటన్- మలేషియా- సింగపూర్ – బంగ్లాదేశ్- సింగపూర్ మరికొన్ని దేశాలలో వైల్డ్ డాగ్ ట్రెండింగ్ లో ఉంది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై మిలియన్ల వీక్షణలతో ఈ చిత్రం ది బెస్ట్ గా నిలిచింది. ఓటీటీలో వైల్డ్ డాగ్ బంపర్ హిట్ గా నిలిచింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR: ఆర్ఆర్ఆర్ లో అందమైన ప్రేమకావ్యం.. ఇద్దరు భామలతో ఎన్టీఆర్ ప్రేమాయణం

pawan kalyan: అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లోమార్పులు.. పవన్ కోసం ఆ సీన్స్ యాడ్ చేస్తున్నారట..

నేనే నంబర్ వన్ అంటున్న నటసింహం బాలకృష్ణ.. రికార్డులు క్రియేట్ చేస్తున్న బాలయ్య వీడియో..:Akhanda Teaser video.