Anasuya: అన‌సూయ‌కు త‌ప్ప‌ని క‌రోనా సెకండ్ వేవ్‌.. `ఆహా` వేదిక‌గా థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌.. అధికారిక ప్ర‌క‌ట‌న‌..

Anasuya: క‌రోనా తొలి వేవ్ సినిమా ఇండ‌స్ట్రీపై ఎలాంటి ప్ర‌భావం చూపిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సరం లేదు. చాలా సినిమాలు షూటింగ్‌ల‌ను వాయిదా వేసుకున్నాయి. ఇక నిర్మాణం...

Anasuya: అన‌సూయ‌కు త‌ప్ప‌ని క‌రోనా సెకండ్ వేవ్‌.. `ఆహా` వేదిక‌గా థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌.. అధికారిక ప్ర‌క‌ట‌న‌..
Anasuya Thanku Brother
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 26, 2021 | 7:16 PM

Anasuya: క‌రోనా తొలి వేవ్ సినిమా ఇండ‌స్ట్రీపై ఎలాంటి ప్ర‌భావం చూపిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌సరం లేదు. చాలా సినిమాలు షూటింగ్‌ల‌ను వాయిదా వేసుకున్నాయి. ఇక నిర్మాణం పూర్తి చేసుకున్న కొన్ని సినిమాలను త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఓటీటీలో విడుద‌ల చేశారు. ఇక ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేప‌థ్యంలోనూ అలాంటి ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం థియేట‌ర్లు మూత ప‌డుతున్నాయి. కొన్ని ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు త‌మ‌కు తాము లాక్‌డౌన్‌ను విధించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే కొన్ని బ‌డా సినిమాలు త‌మ విడుద‌ల‌ను వాయిదా వేసుకుంటున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం మ‌ళ్లీ ఓటీటీ బాట ప‌డుతున్నాయి. తాజాగా న‌టి, యాంక‌ర్ అన‌సూయకు కూడా ఓటీటీ బాట‌లో ప్ర‌య‌ణించక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఎదురైంది. అనసూయ గ‌ర్భ‌వ‌తిగా విల‌క్ష‌ణ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌. ర‌మేశ్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది. అయితే ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌క త‌ప్ప‌ట్లేదు. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమాను ఆహా ఓటీటీ వేదిక‌గా మే7 నుంచి ప్ర‌సారం చేయ‌నుంది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపిన అన‌సూయ‌.. ‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సాధ్యమైనంత సురక్షితమైన మార్గంలో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌ను ఆహాలో మే 7 నుంచి వీక్షించండి అంటూ రాసుకొచ్చారు అన‌సూయ‌. మ‌రి అన‌సూయ చూపిన ఈ దారిలో మ‌రిన్ని చిత్రాలు న‌డుస్తాయో చూడాలి.

అన‌సూయ చేసిన ట్వీట్‌..

Also Read: Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్.. ఇప్ప‌ట్లో షూటింగ్స్ కు నో ఛాన్స్

కోవిడ్ పై పోరు, జనరల్ బిపిన్ రావత్ తో ప్రధాని మోదీ సమీక్ష, ఆక్సిజన్ సిలిండర్ల తరలింపునకు నిర్ణయం

Salman Khan And Allu Arjun: అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన స‌ల్మాన్ ఖాన్‌.. ల‌వ్‌ యూ బ్ర‌ద‌ర్ అంటూ..