AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్.. ఇప్ప‌ట్లో షూటింగ్స్ కు నో ఛాన్స్

రీ ఎంట్రీలో బ్లాక్‌ బస్టర్ హిట్‌ కొట్టిన పవన్ కల్యాణ్... ఏ మాత్రం బ్రేక్‌ తీసుకోకుండా వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. వకీల్ సాబ్‌ రిలీజ్‌కు ముందే.....

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్.. ఇప్ప‌ట్లో షూటింగ్స్ కు నో ఛాన్స్
Vakeel Saab
Ram Naramaneni
|

Updated on: Apr 26, 2021 | 7:00 PM

Share

రీ ఎంట్రీలో బ్లాక్‌ బస్టర్ హిట్‌ కొట్టిన పవన్ కల్యాణ్… ఏ మాత్రం బ్రేక్‌ తీసుకోకుండా వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. వకీల్ సాబ్‌ రిలీజ్‌కు ముందే భారీ పీరియాడిక్‌ డ్రామా హరి హర వీరమల్లుతో పాటు, అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ను కూడా పట్టాలెక్కించారు. పారలల్‌గా రెండు సినిమాల షూటింగ్‌లు చేస్తూ ఫుల్‌జోష్‌లో కనిపించారు. అయితే ఈ స్పీడుకు కోవిడ్‌ బ్రేకులు వేసింది.

వకీల్‌ సాబ్‌ రిలీజ్‌ తరువాత పవన్‌, కరోనా బారిన పడటంతో రెండు సినిమాలకూ.. బ్రేక్‌ పడింది. దీంతో 14 రోజుల క్వారెంటైన్‌ తరువాత పవర్‌ స్టార్ మళ్లీ సెట్‌లో అడుగుపెడతారని భావించారు ఫ్యాన్స్‌. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించటం లేదు. పవన్‌కు కరోనా నెగెటివ్‌ వచ్చినా… లంగ్స్‌లో ఇన్‌ఫెక్షన్ మాత్రం తగ్గలేదట. దీంతో ఇప్పట్లో పవర్‌ స్టార్ షూటింగ్‌కు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు.

పవన్‌ కొద్ది రోజులు బెడ్‌ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్‌ సూచించటంతో ఈ రెండు సినిమాలు మరింత ఆలస్యం కానున్నాయి. ప్రజెంట్‌ షూటింగ్ చేసే సిచ్యుయేషన్‌ కూడా లేకపోవటంతో పవర్‌ స్టార్‌ పూర్తిగా కోలుకున్న తరువాతే తిరిగి షూట్‌ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్‌. దీంతో ఆ రోజులు ఎప్పుడొస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌.

Also Read: నూరేళ్ళ అమెరికా ఆర్మీలో కఠినమైన శిక్షణ పూర్తి చేసి చరిత్ర సృష్టించిన మహిళా సైనికులు!

మళ్లీ తెరపైకి రానున్న ‘మాతృదేవోభవ’!!.. నయనతారతోపాటు మరో హీరోయిన్‏తో రీమేక్…