Aha App: సినీప్రియులకు గుడ్ న్యూస్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించనున్న ఆహా..

అచ్చతెలుగు ఆహా యాప్ మళ్ళీ.. కొత్త సినిమాల మేజిక్ ని ఘనంగా షురూ చేసింది. ఒకేరోజు రెండు బిగ్ అనౌన్స్ మెంట్స్ తో తమ ఆడియెన్స్ కి గ్రేట్ సర్ ప్రైజ్ ఇచ్చింది ఆహా

Aha App: సినీప్రియులకు గుడ్ న్యూస్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించనున్న ఆహా..
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 28, 2021 | 10:25 AM

Aha App:  అచ్చతెలుగు ఆహా యాప్ మళ్ళీ.. కొత్త సినిమాల మేజిక్ ని ఘనంగా షురూ చేసింది. ఒకేరోజు రెండు బిగ్ అనౌన్స్ మెంట్స్ తో తమ ఆడియెన్స్ కి గ్రేట్ సర్ ప్రైజ్ ఇచ్చింది ఆహా. థియేటర్ రిలీజ్ ని విత్ డ్రా చేసుకుని.. డిజిటల్ కి కమిటైన థాంక్యూ బ్రదర్… వచ్చే నెల 7 నుంచి ఆహా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేయబోతోంది. అనుసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన థాంక్యు బ్రదర్ మూవీపై మంచి అంచనాలున్నాయి. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేసిన లాక్ డౌన్ నేపథ్యంతో అల్లిన ఒక ఫిక్షనల్ స్టోరీకి తెరరూపమే థాంక్యూ బ్రదర్. గర్భవతిగా నటిస్తున్న అనసూయ.. ఈ మూవీకి స్పెషల్ ఎసెట్. కంటెంట్ అండ్ టేకింగ్.. రెండింటి పరంగా థాంక్యూ బ్రదర్ అందరినీ ఆకట్టుకుంటుందన్న భరోసా నిస్తున్నారు మేకర్స్.  ఇప్పటికే కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. లావణ్య త్రిపాఠి ఇందులో  హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా థియేటర్స్ లో కంటే ఓటీటీ లో ఆదరణ దక్కించుకుంటుంది. ఇదిలా ఉంటే ఆహానుంచే మరో గుడ్ న్యూస్ వచ్చేసింది డిజిటల్ ఆడియెన్స్ కి. కార్తీ, రష్మిక జంటగా రీసెంట్ గా రిలీజైన సుల్తాన్ మూవీ.. ఈనెల 30న ఆహాలో రిలీజ్ కాబోతోంది. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నెపోలియన్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది తెలుగు యాప్ ఆహా..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nithya Menon: చ‌క్క‌నమ్మ చిక్కినా అంద‌మే.. వైట్ డ్ర‌స్‌లో ఏంజెల్‌లా క‌నిపిస్తోన్న నిత్యా.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు..

Corona in Tollywood: టాలీవుడ్ లో విషాదం.. క‌రోనాతో ద‌ర్శ‌క, ర‌చ‌యిత క‌న్నుమూత‌

Prabhas: ‘హీ ఈజ్‌ సో స్వీట్’ అంటూ ప్ర‌భాస్ ను తెగ పొగిడేస్తోన్న ముద్దుగుమ్మ‌లు.. డార్లింగ్ నిజంగా సో కూల్