Corona in Tollywood: టాలీవుడ్ లో విషాదం.. కరోనాతో దర్శక, రచయిత కన్నుమూత
తెలుగు సినీ దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ కరోనాతో కన్నముశారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలువరు ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడిచారు. తాజాగా తెలుగు సినీ డైరెక్టర్, రచయిత సాయి బాలాజీ ప్రసాద్(57) కరోనా కారణంగా చనిపోయారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు సినిమాలను తెరకెక్కించారు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ వంటి సీరియల్స్ కు కూడా దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు రచయితగా.. మరికొన్ని సినిమాలకు స్క్రీన్‌ప్లే రైటర్ గా వర్క్ చేశారు
‘బావగారూ బాగున్నారా!’ సినిమాకి పనిచేసిన స్క్రీన్‌ప్లే టీమ్ లో సాయి ఒకరు. తిరుపతికి చెందిన ప్రసాద్.. రవిరాజా పినిశెట్టి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆయనకు భార్య గౌరి, కుమార్తె స్నేహపూజిత ఉన్నారు. ఆయన మరణంపై సినిమా, టీవీ రంగాలకు చెందిన పలువురు సంతాపం ప్రకటించారు.
Also Read: ఓటీటీలో వైల్డ్ డాగ్.. నేషన్ వైజ్ గుడ్ రెస్పాన్స్.. నాగ్ అంటే ఆ మాత్రం ఉండాలి