Nithya Menon: చక్కనమ్మ చిక్కినా అందమే.. వైట్ డ్రస్‌లో ఏంజెల్‌లా కనిపిస్తోన్న నిత్యా.. వైరల్‌గా మారిన ఫొటోలు..
Nithya Menon: బాల నటిగా కెరీర్ మొదలు పెట్టి అనతి కాలంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నిత్యా మీనన్. నాని హీరోగా నటించిన అలా మొదలైంది చిత్రంతో...
Nithya Menon: బాల నటిగా కెరీర్ మొదలు పెట్టి అనతి కాలంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నిత్యా మీనన్. నాని హీరోగా నటించిన అలా మొదలైంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది తొలి సినిమాతోనే ఆకట్టుకున్నారు. కేవలం తన నటనతోనే కాకుండా గాత్రంతోనూ ఆకట్టుకున్న నిత్యా.. అందరి ప్రశంసలు అందుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మాత్రమే ఓకే చెబుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో నిత్యా సినిమాల్లో కనిపించడం కాస్త తగ్గించింది. తెలుగులో చివరిగా నిన్నిలా నిన్నిలా సినిమాలో నటించిన ఈ చిన్నది తర్వాత మరో సినిమాలో నటించలేరు. అంతేకాకుండా నిత్యా ఇటీవల కాస్త బోద్దుగా మారారు కూడా. ఈ కారణంగానే సినిమా ఆఫర్లు దూరమవుతున్నాయని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ కామెంట్లకు చెక్ పెట్టడానికో.. లేదా తన ఫిట్‌నెస్ ఏంటో నిరూపించుకోవడానికో తెలియదు కానీ.. నిత్యా తాజాగా చాలా సన్న బడ్డారు. మళ్లీ పూర్తి ఫిట్‌నెస్‌తో మునపటి నిత్యా మీనన్‌లా మారారు. నిత్యా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఫొటోలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తెలుపు రంగు డ్రస్‌లో దిగిన ఫొటోల్లో నిత్యా ఏంజెల్‌లా కనిపిస్తోంది. అంతేనా.. చిక్కిన అందంతో.. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు అనిపిస్తోంది. మరి నిత్యా మీనన్ లేటెస్ట్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..
నిత్యా మీనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు..
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Also Read: Karuna Shukla: కరోనాతో.. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ప్రధాని వాజ్‌పేయి మేనకోడలు శుక్లా కన్నుమూత
Watch Video: ఆసుపత్రిలో రగడ.. పోలీసుల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్.. వీడియో వైరల్..