Karuna Shukla: కరోనాతో.. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ప్రధాని వాజ్‌పేయి మేనకోడలు శుక్లా కన్నుమూత

Karuna Shukla passed away: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరూ

Karuna Shukla: కరోనాతో.. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ప్రధాని వాజ్‌పేయి మేనకోడలు శుక్లా కన్నుమూత
Karuna Shukla
Follow us

|

Updated on: Apr 27, 2021 | 11:22 AM

Karuna Shukla passed away: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఈ తరుణంలో చికిత్స పొందుతూ మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఎందరో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను కోవిడ్ మహమ్మారి కబళించింది. తాజాగా కరోనా బారిన పడి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మాజీ ఎంపీ కరుణా శుక్లా (70) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల ఆమె కరోనా బారినపడ్డారు. అనంతరం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుతపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా.. కరుణ శుక్లా మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయికి మేనకోడలు. ఆమె మృతిపై పలువురు కాంగ్రెస్‌ నేతలు విచారం వ్యక్తం చేసి.. ఆమె కుటుంబానికి సంతాపం ప్రకటించారు.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలతో అంతటా భయాందోళన నెలకొంది. తాజాగా గత 24 గంటల్లో సోమవారం దేశవ్యాప్తంగా 3,23,144 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 2,771 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 (1.76 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 1,97,894 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 28,82,204 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Also Read:

Covid-19: కుటుంబాలను కబళిస్తున్న కరోనా మహమ్మారి.. ఒక్కరోజే మామ, కోడలు మృత్యువాత

Covid 19: భారత్‌లో ఆందోళన కలిస్తోన్న కరోనా.. రూపం మార్చుకుంటున్న మహమ్మారి.. పెరుగుతున్న మరణాలు.. దేనికి సంకేతం?