AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti 2021: హనుమాన్ జయంతి ఇంట్లోనే జరుపుకోండి.. మీ స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలపండిలా..

Hanuman Jayanti 2021: ఈశ్వరుని అంశ, వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమంతుడు పుట్టిన రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు.

Hanuman Jayanti 2021: హనుమాన్ జయంతి ఇంట్లోనే జరుపుకోండి.. మీ స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలపండిలా..
Hanuman 1
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2021 | 10:54 AM

Share

Hanuman Jayanti 2021: ఈశ్వరుని అంశ, వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమంతుడు పుట్టిన రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. అర్జునునికి ప్రియ సఖుడు.. శ్రీరామ దాసుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మ శోకాన్ని హరించినవాడు. ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణనుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు ప్రయాణం, నిద్రపోయే ముందు స్మరించినవారికి మృత్యుభయం ఉండదు. ప్రస్తుత పరిస్థితులలో కరోనా మహమ్మరి కారణంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించలేకుండా అయింది. ఎవరి ఇళ్లలో వారు ఉండి కరోనా మహమ్మారిని త్వరగా వదిలిపోయేలా చేయాలని కోరుకుంటూ పూజించడం ఉత్తమం. అలాగే మీకు దూరంగా ఉన్న మీ ఆత్మీయులకు, స్నేహితులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలను చెప్పండిలా..

* అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం.. దనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్! సకల గుణనిధానం వానరాణా మదీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి ! మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..

* గోప్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ రామాయణ మహామాలా రత్నం వందేనీలాత్మజమ్ బుద్ధీర్బలం యశోదైర్యం నిర్బయత్వ మరోగతా అజాడ్యం వార్పటుత్వం చా హనుమాత్ప రణాద్భవేత్.. మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..

* బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ !!!! మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..

* ఆంజనేయ మతి పాటాలాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం.. మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..

* యత్ర యత్ర రఘనాథ కీర్తనం. తత్ర తత్ర కృత మస్థకాంజలిం. భాష్పవారి పరిపూర్ణ లోచనం. మారుతిం సమత రాక్షసాంతకం మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..

Hanuman

Hanuman

Also Read:  శివుడు శయనిస్తూ కనిపించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.. అక్కడ ఆయనకు అభిషేకం కూడా ఉండదు..

Hanuman Jayanti 2021: హనుమాన్ జయంతి తిథి, ముహూర్తం… ప్రాముఖ్యత.. పూజా విధానం..