- Telugu News Photo Gallery Spiritual photos Hanuman jayanti 2021 date timings and significance and pooja vidhi details here
Hanuman Jayanti 2021: హనుమాన్ జయంతి తిథి, ముహూర్తం… ప్రాముఖ్యత.. పూజా విధానం..
హిందూ పండుగలలో మరో ముఖ్యమైన పండగ హనుమాన్ జయంతి. అయితే ఈ పండుగను కొంతమంది చైత్ర మాసంలో, మరికొంత మంది వైశాఖ మాసంలో జరుపుకుంటారు. కేరళలో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. ఈరోజు ఏప్రిల్ 27న మంగళవారం హనుమాన్ జయంతి.
Updated on: Apr 27, 2021 | 10:03 AM

హనుమాన్ జయంతి తిథి 2021 ఏప్రిల్ 27 మంగళవారం వచ్చింది. ఏప్రిల్ 26న మధ్యాహ్నం 12.44 గంటలకు ప్రారంభం కాగా..ఏప్రిల్ 27 ఉదయం 9.01 గంటలకు ముగుస్తుంది.

ప్రాముఖ్యత: వాల్మీకి రచించిన ఉత్తర కందా ప్రకారం వైశాఖ మాసంలో వానర రాజు కేసరి, అంజనా దంపతులకు హనుమంతుడు జన్మించడాట. మునీశ్వరుడు విశ్వామిత్రుడిని బాధపెట్టినందుకు ఆమెను శాపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి ఆమె శివుడిని ఆరాధించిందని.. అందుకే శివుడు హనుమంతుడి అవతారంలో ఆమెకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

హనుమంతుడిని వాయుదేవుని కుమారుడు లేదా గాలి దేవుడు అని కూడా అంటారు. తెలుగు రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ రోజు 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్ష విరమిస్తారు.

పూజా విధానం.. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. "కలౌ కపి వినాయకౌ"అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం.

"యత్ర యత్ర రఘునాథ కీర్తనం- తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్, బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్’" అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు.

ప్రాముఖ్యత: వాల్మీకి రచించిన ఉత్తర కందా ప్రకారం వైశాఖ మాసంలో వానర రాజు కేసరి, అంజనా దంపతులకు హనుమంతుడు జన్మించడాట. మునీశ్వరుడు విశ్వామిత్రుడిని బాధపెట్టినందుకు ఆమెను శాపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి ఆమె శివుడిని ఆరాధించిందని.. అందుకే శివుడు హనుమంతుడి అవతారంలో ఆమెకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

సమీపంలో హనుమాన్ ఆలయాన్ని లేదా రామాలయాన్ని సందర్శిస్తారు. ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపండు నివేదించాలి. ఇలా చేయడం వలన మనసులో అనుకున్న పనులు జరగడమే కాకుండా... కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు తొలగిపోతాయి.

హనుమాన్ జయంతి 2021

ఈరోజు ఏప్రిల్ 27న మంగళవారం హనుమాన్ జయంతి.




