శివుడు శయనిస్తూ కనిపించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.. అక్కడ ఆయనకు అభిషేకం కూడా ఉండదు..

మన దేశంలో ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. కొన్ని చోట్ల మానవ రూపంలో విగ్రహాలు ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పళ్లి కొండేశ్వర క్షేత్రంలో శివుడు పార్వతి ఒడిలో పడుకున్న రూపంలో కనిపిస్తాడు. దేశంలో ఇటువంటి విగ్రహం ఇదొక్కటే. ఈ క్షేత్రాన్ని సూరుటుపళ్లి అని కూడా అంటారు.

Rajitha Chanti

|

Updated on: Apr 25, 2021 | 12:39 PM

క్షీరసాగర మథనం సమయంలో హాలా అనే విషయం బయటికి వస్తుంది. ఆ విష ప్రభావం ప్రపంచం మొత్తాన్ని దహించవేయసాగింది. నివారోపాయం కోసం పరమశివుడు ఆ విషాన్ని మింగుతాడు. శివుడు మింగిన విషం శరీరంలోకి వెళ్లకుండా పార్వతీ దేవి ఆయన కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. విషాన్ని ఆపి జీవితాన్ని అమృత మయం చేసినందువల్లే ఆ తల్లికి అముదాంబిక అని పేరు కూడా వచ్చింది.

1 / 9
ఈ ఘటన తర్వాత పార్వతి, పరమేశ్వరులు తిరిగి కైలాసానికి బయలుదేరుతారు. ఆ ప్రయాణ సమయంలో వారివురూ పళ్లి కొండేశ్వర క్షేత్రం వద్దకు రాగానే అంతటి పరమేశ్వరుడు కూడా విష ప్రభావానికి లోనవుతాడు.

2 / 9
దీంతో ఈ కాసేపు పార్వతి దేవి ఒడిలో విశ్రమించాడు. అందవ్లే ఇక్కడ శివుడు పార్వతి ఒడిలో పడుకున్న రూపం మనకు దర్శనమిస్తుంది. శివుడు శయనించిన క్షేత్రం కాబట్టే దీనికి శివ శయన క్షేత్రం అనే పేరు వచ్చిందనేది కథనం.

3 / 9
 శివుడి శరీరంలోకి విషం వెళ్ల కుండా పార్వతి దేవి రక్షించింది కాబట్టే ఈ క్షేత్రంలో వెలిసిన అముదాంబికను మొదట దర్శించుకుని అటు పై స్వామివారిని దర్శించుకునే ఆచారం ఉంది.

4 / 9
 సవర్వమంగళ శ్రీ పళ్లి కొండేశ్వరస్వామి వారి విగ్రహం 12 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ఆలయంలో దేవతలూ, రుషులూ చుట్టూ నిలబడి ప్రార్థిస్తుండగా పార్వతీ దేవి ఒడిలో శయనిస్తన్నట్టు ఉండే స్వామివారి విగ్రహ రూపం భక్తులకు దర్శనమిస్తుంది.

5 / 9
సురుళ్ అంటే దేవతలని అర్థం. విష ప్రభావానికిలోనైన స్వామివారు తిరిగి లేచేవరకూ బ్రహ్మ, మహావిష్ణువు తదితరులు ఈ క్షేత్రంలోనే ఉండటం వల్ల ఈ ప్రాంతానికి సరుటుపల్లి అని పేరు వచ్చినట్టు స్థానిక కథనం.

6 / 9
ఈ ఆలయంలోని శివుడి విగ్రహానికి అభిషేకానికి బదులు తమిళనాడు నుంచి తెచ్చే చందన తైలాన్ని ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పూస్తారు. దీని వల్ల విష ప్రభావం ఉండదని నమ్మకం

7 / 9
ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర బుక్కరాయులు క్రీ.శ 1344-77 మధ్య నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.

8 / 9
చిత్తూరు లేదా తిరుపతి నుంచి మొదట పుత్తూరు చేరుకోవాలి. అక్కడి నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో 21 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. పుత్తూరు నుంచి ప్రతి పావుగంటకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. ప్రైవేటు వాహనాలు కూడా దొరుకుతాయి.

9 / 9
Follow us