Horoscope Today: ఈరాశుల వారు ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ది ఉంటుంది… ఈరోజు రాశి ఫలాలు..
Rasi Phalalu on april 28th 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు
Rasi Phalalu on april 28th 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ ఈరోజు (ఏప్రిల్ 28న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
మేషరాశి..
ఈరోజు వీరు ఆలోచనలను అమలు పరిచే ప్రయత్నం చేస్తుంటారు. ఆస్తుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. నవగ్రహ పారాయణం చేయడం మంచిది.
వృషభ రాశి..
ఈరోజు వీరికి కుటుంబ పరంగా కొన్ని ఒత్తిళ్లు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది.
మిథున రాశి..
ఈరోజు వీరికి వ్యవహరిక విషయాల్లో మంచి పురోభివృద్ధి ప్రారంభమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు అవుతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది.
కర్కాటక రాశి..
ఈరోజు వీరికి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. శుభవార్తలు వింటుంటారు. ఈరోజు వీరికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
సింహరాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులలో ఏమాత్రం తొందరపడకుండా.. ప్రయోజనాల పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వేరు వేరు రూపాల్లో ధానదర్మాలు తీసుకునే ప్రయత్నాలు ఉంటాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కన్యరాశి..
ఈరోజు వీరు రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. అనుకోని స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.
తులారాశి..
ఈరోజు వీరు సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. విందు కార్యక్రమాల్లో పాల్గోంటుంటారు. లలితా అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరు వేరు వేరు రూపాల్లో ఆదుకునే అవకాశాలు ఉంటాయి. సహయం కోరి వచ్చేవారికి ఆదుకుంటారు. ఈరోజు పేదవారికి కాయగూరలు దానం చేసుకోవడం మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. గణేశ స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.
మకర రాశి..
ఈరోజు వీరు షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంజనేయ స్వామిని పూజించుకోవడం మంచిది.
కుంభరాశి..
ఈరోజు ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గోంటారు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఈరోజు శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
మీనరాశి..
ఈరోజు వృత్తి, వ్యాపారాల పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. గణపతి అర్చన, సుదర్శన స్వామి వారి నామస్మరణ మేలు చేస్తుంది.
Also Read: Hanuman Jayanti 2021: హనుమాన్ జయంతి తిథి, ముహూర్తం… ప్రాముఖ్యత.. పూజా విధానం..
అత్తిలిలో వెలసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రాముఖ్యత తెలుసా..